క్రైమ్/లీగల్

ఐదు బృందాలుగా ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, మార్చి 18: మహిళ హత్య కేసును చేధించేందుకు నిందితులను పట్టుకునేందుకు ఐదు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు. చేవెళ్ల మండల పరిధిలోని తంగడ్‌పల్లి గ్రామ పరిధిలోని చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు క్షుణంగా పరిశీలిస్తున్నారు. మృతి చేందిన మహిళ 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నివేదిక ప్రకారం మహిళ మెడకు తాడుతో ఉరేసిన అనంతరం తలపై బలంగా కోట్టి, హత్య చేసినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
తెల్లవారు ఝామున 2 నుంచి 3 గంటల ప్రాంతంలో హత్య చేసినట్లు వివరించారు. మృతురాలు ఒంటిపై ఉన్న రింగు, చైన్ బంగారం గాజులు స్టోన్తో కూడిన గొలుసులు ఉన్నాయి. దానిపై హోల్‌మార్కు ఏ రాష్టం మహిళలు ఎక్కువగా ఉపయోగిస్తారనే కోణంలో పోలీసలు విచారణ కొనసాగిస్తున్నారు.
పోలీసులు కేసును వేగవంతంగా విచారణ కొనసాగిస్తున్నారు. త్వరలోనే మహిళ హత్య కేసును చేధిస్తామని పోలీసులు తెలిపారు.