క్రైమ్/లీగల్

విశ్వాస పరీక్షకు ఆదేశించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మెజారిటీ నిరూపించేందుకు పనె్నండు గంటలలోగా శాసనసభలో బలపరీక్ష నిర్వహింపజేయాలంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు మరో తొమ్మిది మంది బీజేపీ శాసనసభ్యులు సంతకాలు చేసిన ఈ పిటిషన్‌ను మెన్షనింగ్ అధికారి ముందు ప్రస్తావించగా మంగళవారం విచారణ జరపాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. మధ్యప్రదేశ్ స్పీకర్ ప్రజాపతి సోమవారం ఉదయం శాసన సభలో గవర్నర్ లాల్జీ టాండన్ ప్రసంగం ముగిసిన అనంతరం బలపరీక్ష కార్యక్రమం చేపట్టకుండా కరోనా వైరస్ మూలంగా భయానక పరిస్థితులు నెలకొన్నందున శాసనసభను ఈనెల 26 తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి సభ నుండి వెళ్లిపోయారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం స్పీకర్ ప్రజాపతి గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే బలపరీక్ష కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. అయితే గవర్నర్ వెళ్లిపోగానే స్పీకర్ ప్రజాపతి కరోనా వైరస్ మూలంగా దేశవ్యాప్తంగా నెలకొన్న భయానక పరిస్థితులను ఉటంకిస్తూ శాసనసభను ఈనెల 26 తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. స్పీకర్ వ్యవహరించిన తీరుతో మండిపోయిన మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా వైరస్ కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కాపాడుతుందనుకోవడం భ్రమే అని వ్యాఖ్యానించారు. కమల్‌నాథ్ ఎక్కువ రోజులు కరోనా వైరస్ వెనుక దాక్కోలేరని పేర్కొన్న చౌహాన్ ఆ తరువాత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన మెజారిటీని నిరూపించుకునేందుకు పనె్నండు గంటలలోగా శాసనసభలో బలపరీక్ష జరిగే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఆయన తన పిటిషన్‌నలో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది శాసనసభ్యులు తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని శివరాజ్ సింగ్ చౌహాన్ తన పిటిషన్‌లో వాదించారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అమలు చేయనందుకు అసంతృప్తితో ఉన్న 22 మంది శాసనసభ్యులు తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ రాజీనామాలతో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని చౌహాన్ తన పిటిషన్‌లో వాదించారు. 22 మంది శాసనసనభ్యులు తమ రాజీనామా లేఖలను ఈనెల 10వ తేదీనాడు స్పీకర్‌కు అందజేశారని చౌహాన్ కోర్టుకు వివరించారు. కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినందున శాసనసభలో బలపరీక్ష జరపాలని కోరుతూ ఈనెల 14వ తేదీన గవర్నర్ లాల్జీ టాండన్‌కు లేఖ కూడా రాశామని బీజేపీ తమ పిటిషన్‌లో పేర్కొంది. ఈనెల 16న బలపరీక్ష జరపాలని గవర్నర్ ఆదేశించినా స్పీకర్ ప్రజాపతి మాత్రం బలపరీక్ష నిర్వహించకుండా శాసనసభను పది రోజుల పాటు వాయిదా వేశాలని చౌహాన్ తన పిటిషన్‌లో వివరించారు.
మొత్తం 22మంది శాసనసభ్యులు రాజీనామా చేయగా ఇందులో నుండి ఆరుగురు మంత్రుల రాజీనామాల ఆమోదం కూడా జరిగింది. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని చౌహాన్ వాదించారు. మెజారిటీ కోల్పోయిన కమల్‌నాథ్ ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగేందుకు నైతిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగపరమైన హక్కు లేదని శివరాజ్‌సింగ్ చౌహాన్ తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మెజారిటీ కోసం ప్రజాప్రతినిధులను ప్రలోభానికి గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. కమల్‌నాథ్ కొందరు ప్రజాప్రతినిధులను భయపెడుతున్నారని కూడా చౌహాన్ ఆరోపించారు. ఎస్ ఆర్ బొమ్మై కేసులో తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ బెంచ్ ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ శాసనసభ్యులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా, ప్రభుత్వానికి సభలో మెజారిటీ లేదనిపించినా బలపరీక్షకు అదేశించడం గవర్నర్ బాధ్యత, విధి అని చౌహాన్ తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. గవర్నర్ లాల్జీ టాండన్ తన విధిలో భాగంగానే సోమవారంనాడే బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్‌ను ఆదేశించినా స్పీకర్ మాత్రం కరోనా వైరస్ పేరుతో సభను పది రోజుల పాటు వాయిదా వేసి వెళ్లిపోయారని చౌహాన్ తమ పిటిషన్‌లో సుప్రీం కోర్టుకు వివరించారు. శాసనసభలో వెంటనే బలపరీక్ష జరగకపోతే శాసనసభ్యుల కొనుగోలు మరింత ఉధృతం అవుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభలో బలపరీక్ష జరిపేందుకు ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అంగీకరించకపోవడం చూస్తుంటే ఆయన మెజారిటీ కోల్పోయారనేది స్పష్టమవుతోందని శివరాజ్ సింగ్ చౌహాన్ తన పిటిషన్‌లో వాదించారు.

*చిత్రం...మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్