క్రైమ్/లీగల్

ఉరి శిక్ష ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు న్యాయ వ్యవస్థతో చెలగాటం ఆడుతూ మరణ శిక్షను వాయిదా వేయించుకుంటున్న ‘నిర్భయ’ దోషు లు మరో ఎత్తు వేశారు. తమకు ఉరి పడే తేదీ సమీపిస్తుండడంతో ఈ సారి ఏకంగా అంతర్జాతీయ న్యాయ స్థానా నే్న ఆశ్రయించారు. నలుగురు దోషుల్లో ముగ్గురు తమ ఉరి శిక్షను నిలిపి వేయాలని కోరుతూ
హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయ స్థానంలో పిటిషన్ వేసినట్లు వారి తరఫు న్యాయవాది ఏపీ సింగ్ వెల్లడించారు. నిర్బయ కేసులో తమకు ఉరి శిక్ష వేయడానికి దారి తీసిన విచారణ తప్పుల తడకగా సాగిందని, తమను మనుషులుగా పరిగణించలేదని పిటిషన్‌లో ఈ ముగ్గురు దోషులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు దోషులైన విజయశర్మ, పవన్ కుమార్ గుప్తా, అక్షయ్ సింగ్, ముఖేష్ సింగ్‌లకు న్యాయపరమైన అవకాశాలు పూర్తి కాలేదని ఏపీ సింగ్ తెలిపారు. కేసులు ఇంకా పెండింగ్‌లో ఉండగానే వారిని మార్చి 20న ఉరి తీయడానికి అధికారులు సిద్ధం కావడం ఆశ్చర్యకరంగా, విస్మయకరంగా ఉందని పిటిషన్‌లో న్యాయవాది పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా లై-డిటెక్టర్, బ్రెయిన్ మ్యాపింగ్‌తో సహా అన్ని రకాల పరీక్షలను ఎదుర్కొంటామని దోషులు చెప్పినప్పటికీ వాటిని తిరస్కరించారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మొత్తం కేసులో తప్పుడు వాంగ్మూలాల అవకాశాలను సత్వరమే విచారించాలని ఈ పిటిషన్‌లో అంతర్జాతీయ న్యాయ స్థానాన్ని కోరారు. ఈ కేసులో వారిని తప్పుడు అభియోగాలతో ఇరికించారని పేర్కొన్నారు.