క్రైమ్/లీగల్

మా గ్రామాలకు ఎన్నికలు జరపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 12: మా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలంటూ మచిలీపట్నం నగర పాలక సంస్థలో విలీన ప్రతిపాదిత గ్రామ పంచాయతీలకు చెందిన కొంత మంది హైకోర్టును ఆశ్రయించారు. బందరు మండలంలోని పోతేపల్లి, మేకావానిపాలెం, అరిసేపల్లి, సుల్తానగరం, చినకరగ్రహారం, పెదకరగ్రహారం, గరాలదిబ్బ, ఎస్‌ఎన్ గొల్లపాలెం, రుధ్రవరం గ్రామ పంచాయతీలను మచిలీపట్నం నగర పాలక సంస్థలో విలీనం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇటీవల ఆ తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిలిపి వేయాలని పురపాలక శాఖ కమిషనర్ పంచాయతీ రాజ్ కమిషనర్‌ను కోరారు. దీంతో ఆయా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని ఎనిమిది ఎంపీటీసీ సెగ్మెంట్లకు, బందరు మండల జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిలిపి వేశారు. దీంతో ఆ తొమ్మిది గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణపై కూడా నీలి నీడలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో తమ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఒకొక్క గ్రామం నుండి ఒకొక్కరు హైకోర్టును ఆశ్రయించారు. ఒక పక్క నగర పాలక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తమ పంచాయతీల ఎన్నికలు కూడా జరపాలని అరిసేపల్లి నుండి ఎ శివయ్య, రుధ్రవరం నుండి ఎన్ వెంకట రామకృష్ణారావు, చినకరగ్రహారం నుండి ఎ అశోక్ కుమార్, మేకావానిపాలెం నుండి కె రాధాకృష్ణమూర్తి, కరగ్రహారం నుండి ఎం వీర రాజు, గరాలదిబ్బ నుండి టి శంకరయ్య, పోతేపల్లి నుండి టి ఆదిశేషు, ఎస్‌ఎన్ గొల్లపాలెం నుండి కె సురేష్, సుల్తానగరం నుండి సిహెచ్ వనరాజులు హైకోర్టును ఆశ్రయించిన వారిలో ఉన్నారు.