క్రైమ్/లీగల్

‘సారా‘ స్థావరాలపై పోలీసుల పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కాపుసారా విక్రయాలపై పోలీసులు పంజా విసురుతున్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖాధికారులతో పోలీసులు ‘ఆపరేషన్ స్పిరిట్’ పేరుతో నాటుసారా తయారీ స్థావరాలపై విస్తృత దాడులు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్‌లు వేసింది. ఏ రాజకీయ పార్టీ అభ్యర్థి అయినా ఓటర్లకు మద్యం, డబ్బు పంపిణీ చేసినట్టు తెలిస్తే సంబంధిత వ్యక్తి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడానికి ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మద్యం, డబ్బు పంపిణీని నిరోధించాలని పోలీసు యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారి మద్యపాన నిషేధంలో భాగంగా విచ్చలవిడి మద్యం అమ్మకాలకు బ్రేక్‌లు పడ్డాయి. ప్రభుత్వమే నేరుగా పరిమితి మేర మద్యం విక్రయాలు చేస్తోంది. ఈ క్రమంలో మద్యం కోసం మందుబాబులు ప్రభుత్వ మద్యం దుకాణాల ఎదుట కూరగాయల మార్కెట్‌లో బారులు తీరిన మాదిరి బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులకు ఆశించిన మేర మద్యం నిల్వలు లభించని పరిస్థితి ఏర్పడింది. దీన్ని అసరాగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా నాటు కాపుసారా తయారయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ‘ఆపరేషన్ స్పిరిట్’కు పిలుపునిచ్చింది. గడిచిన 48 గంటలకు క్రితం ప్రారంభమైన ఆపరేషన్ స్పిరిట్ కాపుసారా తయారీదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. బుధవారం తెల్లవారు జామున 4గంటల నుండి సుమారు వెయ్యి మంది సిబ్బంది సారా తయారీ స్థావరాలపై విస్తృత దాడులు చేస్తున్నారు. అడిషనల్ ఎస్పీ, ఒక ప్రొహిబిషన్ ఐపీఎస్ అధికారి, నేతృత్వంలో ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 60 మంది ఎస్‌ఐలు వెయ్యి మంది సిబ్బందితో మెరుపుదాడులు చేస్తున్నారు. జిల్లా అంతటా జల్లెడ పడుతూ కాపుసారా నిల్వలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో బెల్లం ఊట, సారా నిల్వలను గుర్తించి వాటిని అక్కడిక్కడే ధ్వంసం చేశారు. 8,305 లీటర్ల బెల్లం ఊట, 325 లీటర్ల సారాను ధ్వంసం చేయగా 43 కేసులు నమోదు చేసి 38 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి ఆరు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు, 40 బ్రాంది బాటిల్స్, ఆమోనియా కేజీ, యూరియా 2కేజీలు, నల్ల బెల్లం 80కేజీలు స్వాధీనం చేసుకున్నారు.