క్రైమ్/లీగల్

20న ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులకు ఉరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూడిల్లీ, మార్చి 5: నలుగురు నిర్భయ దోషులను మార్చి 20 తేదీ ఉదయం ఆరు గంటలకు ఉరి తీస్తారు. ఢిల్లీ పటియాలా సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి ధరేంద్ర రాణా గురువారం తాజా డెత్ వారెంట్ జారీ చేశారు. నిర్భయ దోషులు నలుగురికి సంబంధించిన పిటిషన్లు ఏ కోర్టులో కూడా పెండింగ్‌లో లేనందున తాజా డెత్ వారెంట్ జారీ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం, తీహార్ జైలు అధికారులు పిటిషన్లు దాఖలు చేశారు. సెషన్స్ న్యాయమూర్తి ధరేంద్ర రాణా పిటిషన్లను విచారించిన తరువాత ఆదేశాలు జారీ చేశారు. నిర్భయ నాల్గో ముద్దాయి పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం తిరస్కరించిన సంగతి తెలిసిందే. నిర్భయ దోషుల ఉరి శిక్ష ఇప్పటికి మూడు సార్లు వాయిదా పడింది. న్యాయపరంగా వారికున్న అన్ని అవకావాలనూ ముద్దాయిలు వినియోగించుకున్నారు. నలుగురు నిర్భయ దోషులు వరుసగా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లను రాష్టప్రతి తిరస్కరించారు. సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టులో వీరు వివిధ కారణాలతో దాఖలు చేసిన పిటిషన్ల పర్వం
కూడా ముగిసింది. దీనికితోడు నలుగురు నిర్భయ దోషులు తమకు గల న్యాయపరమై అవకాశాలను వారం రోజుల్లో ఉపయోగించుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు గడువు కూడా దాటిపోయింది. ఈ నేపథ్యంలో మార్చి 20 తేదీ ఉదయం 6 గంటలకు నలుగురు దోషులు ఉరికంబం ఎక్కక తప్పదు. గొంతుకు ఉరి తాడు బిగించటం ద్వారా మరణించేంత వరకు ఉరి తీయాలని సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి ధరేంద్ర రాణా తన తాజా డెత్ వారంట్‌లో స్పష్టం చేశారు. మొదట వీరిని జనవరి 22 తేదీనాడు ఉరితీయవలసి ఉండింది. అప్పుడు స్టే ఇవ్వడంతో ఆగిపోయింది. రెండోసారి ఫిబ్రవరిలో ఉరి శిక్ష అమలు చేయాల్సింది. అప్పుడూ అమలు కాలేదు. మూడో సారి మార్చి 2న ఉరి కంబం ఎక్కాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల కోర్టు నిలుపుచేసింది. అయితే నిర్భయ దోషుల న్యాయవాది ఒకరి తరువాత మరొక దోషి ద్వారా రాష్టప్రతికి క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయటం ద్వారా ఉరి శిక్షను వాయిదా వేయించాడు. ఇప్పుడు ఆఖరు నిర్భయ దోషి పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ కూడా తిరస్కారానికి గురి కావటంతో నలుగురుకి మార్చి 20 తేదీ ఉదయం ఆరు గంటలకు ఉరి శిక్ష అమలు చేయనున్నారు.