క్రైమ్/లీగల్

మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నైజీరియన్ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 25: క్రైస్తవ మిషనరి పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తయారుచేసి వాటి ద్వారా వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని అందినకాడికి నగదు కాజేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నైజీరియన్లను జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. మంగళవారం ఒంగోలులో జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జిల్లా ఎస్‌పి సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ ఫేస్ బుక్ సామాజిక మాధ్యమం ద్వారా క్రైస్తవ మత ప్రచారకుడుగా చలామణి అవుతూ , ఆమాయకులను బుట్టలో వేసుకుని లక్షలాది రూపాయలు స్వాహా చేసిన నైజీరియా ముఠాను పొదిలి పోలీసులు ఢిల్లీలో వలపన్ని ఆరెస్ట్ చేసినట్లు ఎస్‌పి తెలిపారు. ఒయంకో హైజినస్ అనే నైజీరియాకు చెందిన వ్యక్తి 2012 లో ఫుట్‌బాల్ కోచ్ గా పనిచేసేందుకు ఇండియాకు వచ్చినట్లు చెప్పుకుంటూ తన వీసా కాలపరిమితి ముగిసినప్పటికీ ఇండియాలోనే ఉండటంతో ఢిల్లీ పోలీసులు 2015 ఫారినర్స్ యాక్టు 14 కింద అరెస్ట్ చేసి జైలుకి పంపారని ఎస్‌పి తెలిపారు. రెండు సంవత్సరాల తర్వాత తీహార్ జైలు నుంచి విడుదలై మోసం చేయడం వృత్తిగా పెట్టుకుని , టి.బి జాషువా మినిస్ట్రీస్ పేరుతో అనేక నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసి , అనేక సిమ్ కార్డ్స్ మారుస్తూ ఆమాయక ప్రజలను మోసం చేస్తూ వారి కుటుంబానికి ప్రార్ధన చేస్తాం అని నమ్మించసాగాడని ఎస్‌పి తెలిపారు.
ఈ క్రమంలో పొదిలి బాప్టిస్టు కాలనీకి చెందిన వేల్పుల అచ్చయ్య అనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ , పై ఫేస్బుక్ పేజీ ఫాలో అవుతూ చాటింగ్ చేయసాగినట్లు ఎస్‌పి తెలిపారు. నిందితుడు భారతదేశంలో అనేక చర్చీలు , హాస్పిటల్స్ నిర్మిస్తున్నామని , అందుకు గాను 2.4 మిలియన్ డాలర్ల డబ్బులు తీసుకొని బయలుదేరుతున్నామని , నీవు మాకు సహకరిస్తే 20శాతం కమిషన్ ఇస్తామని వాట్సప్ కాల్స్ చేస్తూ నిమ్మిస్తూ వచ్చాడని ఎస్‌పి తెలిపారు. మొదట అచ్చయ్యతో తాము ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులచే పట్టుబడ్డానని, కొంత డబ్బు బ్యాంక్ అకౌంట్‌లో వేయమని అడగగా ఫిర్యాది కొంత డబ్బు ఒక అకౌంట్‌లో వేశాడన్నారు. తరువాత పలు దఫాలుగా రిజర్వు బ్యాంకు క్లియరెన్స్ , ఇన్‌కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ అని పలు రకాల క్లియరెన్సులు కావాలని 14 లక్షల 67వేల రూపాయలను వివిధ బ్యాంకు ఎకౌంట్ లలో వేయించుకున్నాడన్నారు.
తర్వాత తాను మోసపోయిన విషయాన్ని గమనించిన ఫిర్యాది అచ్చయ్య పొదిలి పోలీసులను ఆశ్రయించగా పొదిలి పోలీసులు ఐటి యాక్టుగా కేసు నమోదు చేసి , పొదిలి సిఐ వి శ్రీరామ్ కేసు దర్యాప్తు ప్రారంభించామన్నారు. అనేక సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు , కొనకనమిట్ల ఎస్‌ఐ నాయక్ ఆధ్వర్యంలో ఢిల్లీలో మాకాం వేసి , ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసుల సహాకారంతో ఈ కేసును చేధించి కేసులో ముగ్గురు ముద్దాయిలు అయిన ఒయంకో హైజినస్, షహీద్ ఖాన్, మొహమ్మద్ యాకూబ్ అనే వారిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న 5 మొబైల్ ఫోన్లు, 9 ఎటియం కార్డులు, 22 చెక్ బుక్స్, నేజీరియా దేశానికి సంబంధించిన పౌర సత్వపు కార్డును స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్‌పి తెలిపారు. ఈ కేసులో మరికొంత మంది పాత్రల పై విచారణ చేయవలసి ఉందని, వీరి బ్యాంక్ ఎకౌంట్ లను స్తంబింప చేయాలని కోరుతూ ఆయా బ్యాంకులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని ఎస్‌పి తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభా పాటవాలు చూపిన పోలీసు వారికి ఎస్‌పి సిద్దార్థ కౌశల్ రివార్డులను ప్రకటించి అందజేయడం జరిగింది.
ఇది ఇలా ఈ విషయం పై జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ మద్య కాలంలో మీ సెల్ పోన్లకు వివిధ రకాలైన మోసపూరిత ఫోన్ కాల్స్ , మెస్సేజెస్ లు , ఫేస్ బుక్ నకిలీ ఖాతాలు , నకిలీ లింకులు వస్తున్నాయని ఎస్‌పి తెలిపారు. వాటిని ఓపెన్ చేసి అడిగిన సమాచారాన్ని అందిస్తే మీ బ్యాంక్ ఖాతాలలో ఉన్న సొమ్మును అతిసులభంగా మోసగాళ్ళు తస్కరించగలరని ఎస్‌పి తెలిపారు. ఈ విలేఖర్ల సమావేశంలో దర్శి డిస్‌పి కె ప్రకాశరావు, పొదిలి సిఐ వి శ్రీరామ్, ఎస్‌బి - 2 సిఐ ఎన్ శ్రీకాంత్ బాబు, కొనకనమిట్ల ఎస్‌ఐ యంవి నాయక్, పొదిలి ఎస్‌ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. విలేకర్ల సమావేశం అనంతరం సిబ్బందికి రివార్డులను అందజేశారు.