క్రైమ్/లీగల్

బాలికపై హత్యాచారం కేసులో దోషికి మరణ శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 24: అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించి ప్రాణాలు తీసిన మానవ మృగానికి మరణ దండన విధిస్తూ చిత్తూరు జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి వెంకటహరినాధ్ సోమవారం సంచలన తీర్పు నిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టంచిన ఈ కేసు విచారణ వంద రోజుల్లో ముగిసింది. రాష్ట్రంలో పోక్సో చట్టం వచ్చిన తరువాత ఇదే తొలి తీర్పు కావడం విశేషం . గతంలో ఎన్నడూ లేని విధంగా పది రోజుల వ్యవధిలో ఈ కేసును చేదించి, 17 రోజుల్లోనే పోలీసులు కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఇందులో 29 మంది సాక్షులను విచారించారు. గత ఏడాది నవంబర్ నెల ఆరవ తేదిన చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని ఒక ప్రైవేట్ కల్యాణ మండపంలో బి కొత్తకోట మండలానికి చెందిన దంపతులు తమ పిల్లలతో వివాహానికి హాజరయ్యారు . ఇందులో ఆరేళ్ల చిన్నారికి మదనపల్లి మండలం బసిన కొండ గ్రామానికి చెందిన లారీ క్లీనర్ రఫీ (27) మాయమాటలు చెప్పి సెల్పీలు తీస్తూ కల్యాణ మండపం వెనుక భాగానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసి పారిపోయాడు. కల్యాణ మండపంలో చలాకీగా ఉన్న చిన్నారి ఆచూకీలేక పోవడంతో బంధుమిత్రులందరూ పరిసరాల్లో గాలించినా ఆచూకీ దొరక లేదు. మరుసటి రోజు ఉదయం ఆ చిన్నారి మృతదేహం కల్యాణ మండపం సమీపంలో బంధువులు గుర్తించారు. చిన్నారి శరీరంపై గాయాలు రక్తపు మరకలు ఉండటంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తూ కేసును నమోదు చేశారు. ఈఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేక్తించింది. దీంతో ఛాలెంజ్‌గా తీసుకొన్న పోలీసులు సోషల్ మీడియా, సీసీ పుటేజిల ఆధారంగా నిందితుడైన రఫీని ఆదే నెల 16న అరెస్టు చేసి రిమాండ్‌కు తలరించారు. అనంతరం పోలీసులు నిందితుడిపై ఫోక్సా హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసు సంబంధించి పోస్టు మార్టం రిపోర్టు, ఇతర నివేదికలను పరిశీలించి కోర్డులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసును చిత్తూరు మొదటి అదనపు కోర్డు విచారణ చేపట్టి 29 మంది సాక్షులు విచారించి రఫీ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు నిచ్చారు. ఈదారుణ సంఘటన చోటు చేసుకొన్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా స్పందించి ఈ కేసును త్వరగా ఛేదించి దోషికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసులను అదేశించారు. రాష్ట్ర విభజన తరువాత ఫోక్సా చట్టం వచ్చిన తరువాత దోషికి మరణశిక్ష పడటం ఇదే ప్రథమం కావడం గమనార్హం.
*చిత్రం...రఫీని కోర్టుకు హాజరుపరుస్తున్న పోలీసులు