క్రైమ్/లీగల్

పట్టపగలే దొంగతనం.. రూ.8లక్షల సొత్తు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 20: కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలోని చి ట్టినగర్ కుండల మార్కెట్ వద్ద గురువారం పట్టపగలు ఓ ఇంటి తాళాలు తీ సిన దర్జా దొంగలు సుమారు రూ.8ల క్షల సొత్తుతో ఉడాయించారు. నిత్యం జన సంచారం ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో గుట్టుచప్పుడు గాకుండా నేరానికి పాల్పడిన వారు ఆ ఇంటికి రాకపోకలు సాగించే తెలిసిన వారే పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన వివరాలు ఇ లా ఉన్నాయి, మెయిన్‌రోడ్డు ఎస్‌బీఐ ఎటీఎంపై భాగాన తాపీ మేస్ర్తీ దాసరి ఏసు (38) నివాసముంటున్నాడు. ఏసు భార్య కృష్ణవేణి వస్తల్రతలోని ఓ వస్తద్రుకాణంలో పని చేస్తుంది. ఎవరిదారి న వారెళ్లారు. వారి కుమార్తె 10వ తరగ తి చదువుతోంది. గురువారం మధ్యా హ్నం స్కూల్ నుండి భోజనానికి ఇంటి కి వచ్చిన ఏసు కుమార్తె ఇంటి తలుపులు తీసి ఉండడాన్ని గమనించింది. లాగే బీరువా తెరచి ఉండడంతో దొం గలు పడ్డారని గ్రహించి వెంటనే తన తల్లికి ఫోన్ చేసింది. కుటుంబ సభ్యులందరూ ఇంటకి వచ్చి దొంగలు తమ సొత్తుని దోచుకున్నారని కొత్తపేట పో లీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కొత్తపే ట సీఐ ఎండీ ఉమర్, క్రైం ఎస్‌ఐ కృష్ణ లు నేర స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వేలిముద్రలు సేకరించారు. రూ. 3లక్షల నగదు, రెండు పేటల నల్లపూసల గొలుసు, బ్రాస్‌లెట్, చెవి రింగులు మాటిలు, చిన్న ఉంగరాలు నాలుగు, పెద్ద ఉంగరాలు రెండు మొత్తం 130 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగల పాలయ్యాయని, బంగారం రూ. 5.20 లక్షలు కలుపుకుని మొత్తం రూ.8లక్షల సొత్తుని దొంగలు ఎత్తికెళ్లారు. ఇంటి తాళాలు కిటికీ వద్దగల షూ సాక్సుల్లో ఉంచి వాటికి అడ్డంగా బట్టలు ఆరేయడం ఆనవాయితీ. బీరువా తాళాలు కూడా ఓ బాక్స్‌లో పెడతామని ఇంటి తాళం చెవితో తాళం తీసి బీరువా తాళాలు తీసి ఈ నేరానికి పాల్పడిన వారు ఆ ఇంటి ఆనవాలు పూర్తిగా తెలిసిన వారే అయి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాపీమేస్ర్తీ దాసరి ఏసు కింద సుమారు 25మంది పని వారలు తాపీ పనికి వస్తుంటారు. మేస్ర్తీ ఇంటికి రాకపోకలు సాగించే బాగా తెలిసిన వారే ఈ నేరానికి పాల్పడి ఉంటారని పోలీసులు తొలుత అనుమానితుల జాబితాని సిద్ధం చేస్తున్నారు. సీఐ ఎండీ ఉమర్ ఆధ్వర్యంలో క్రైం ఎస్‌ఐ కృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం రాత్రి రూ. 35లక్షలు పట్టుకున్న పోలీసులకు పట్టుకోండి చూద్దాం అంటూ పగటి దొంగ సవాల్ విసిరినట్లైంది.