క్రైమ్/లీగల్

నిర్భయ నిందితుడు వినయ్ విజ్ఞప్తిపై మీ స్పందనేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్యకేసులో ఉరి శిక్ష పడిన నలుగురు నిందితుల్లో ఒకరు పెట్టుకున్న విజ్ఞప్తిపై స్పందన ఏమిటో తెలియజేయాల్సింగా ఢిల్లీ కోర్టు గురువారం తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. మానసిక వైకల్యానికి సంబంధించిన ‘స్కిజోప్రెనియా’ అనే జబ్బుతో తాను బాధపడుతున్నానని, తల, భుజాలపై గాయాలున్నాయని, తనకు మంచి వైద్య సహాయం కావాలని నిందితుడు వినయ్ కుమార్ శర్మ విన్నవించుకున్నాడు. దీనిపై వచ్చే శనివారం నాటికల్లా సమాధానం ఇవ్వాల్సిందిగా అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా తీహార్ జైలు అధికారులను ఆదేశించారు. కాగా జైలు అధికారుల కథనం మేరకు జైలు నంబర్-3లో నిందితుడు శర్మ జైలుగది గోడలకు తలబాదుకుని తనకు తాను గాయపరచుకున్నాడని తెలుస్తోంది. గత ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనితోబాటు ఏర్పడిన మరికొన్ని స్వల్పగాయాలకు జైలులోపలే వైద్యం చేయించామని అధికారులు అంటున్నారు. ఇలావుండగా నిందితుడు చేసుకున్న విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఐతే నిందితుడి కుటుంబీకుల విజ్ఞప్తి మేరకు తాము జైలును సందర్శించినపుడు నిందితుడు శర్మ తీవ్ర గాయాలతో ఉన్నాడని నిందితుడి తరపు న్యాయవాది (కౌనె్సల్) పేర్కొన్నారు. కనీసం తన తరపు న్యాయవాదిని, తల్లిని సైతం నిందితుడు గుర్తుపట్టలేకపోయాడని తెలిపారు. అలాగే చాలాకాలంగా నిందితుడికి సరైన నిద్ర కూడా కరవైందన్నారు. కాగా మార్చి 3న ఉదయం 6 గంటలకు ఈ నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాల్సిందిగా ఈనెల 17న న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజా డెత్ వారెంట్లను నిందితులు ముఖేష్ కుమార్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ కుమార్ శర్మ (26), అక్షయ్ కుమార్ (31)కు న్యాయస్థానం జారీ చేసింది.