క్రైమ్/లీగల్

నకిలీ ఆధార్, పాన్ కార్డులతో బ్యాంకులకు బురిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నొయిడా (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 19: ఫోర్జరీ చేసిన ఆధార్, పాన్ కార్డుల ఆధారంగా క్రెడిట్ కార్డులతో బ్యాంకులకు టోకరా వేసి కోట్లాది రూపాయిలు కొట్టేయడానికి యత్నించిన ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గ్రేటర్ నొయిడా పోలీసుల కథనం మేరకు.. స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు ఇద్దరు నిందితుల నుంచి 25వేల మంది పౌరులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డేటాతో పాటు ఇద్దరిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకొన్నారు. వీరిని గ్రేటర్ నొయిడాలోని బిస్రక్ ప్రాంతానికి చెందిన రాజ సక్సేనా, రాజస్థాన్‌లోని గంగానగర్‌కు చెందిన కౌటిల్యశర్మగా గుర్తించారు. 25వేల మంది పౌరుల ఫోన్ నంబర్లు, ఆధార్, పాన్ వివరాలతో పాటు మరో ఆరువేల మంది పౌరులకు సంబంధించిన వివరాలను వీరిద్దరి నుంచి స్వాధీనం చేసుకొన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ‘స్వాధీనం చేసుకొన్న డేటాలో 29 నకిలీ ఆధార్ కార్డులు, పది నకిలీ పాన్ కార్డులు, 19 క్రెడిట్ కార్డులతో పాటు వివిధ కంపెనీలకు చెందిన వేతన వివరాలతో పాటు మరికొంత డేటాను వీరి నుంచి స్వాధీనం చేసుకొన్నట్లు’ ఎస్టీఎఫ్ డీఎస్పీ రాజ్‌కుమార్ మిశ్రా తెలిపారు. 2013లో చత్తీస్‌గఢ్ సీఎం పీఏను మోసం చేసేందుకు యత్నించిన కేసులో వీరిద్దరినీ జైలులో ఉంచినట్లు మిశ్రా వివరించారు. 2016లో బజాజ్ ఫైనాన్స్‌ను మోసం చేసిన కేసులో వీరిద్దరూ అరెస్టయ్యారు. ఇద్దరిపైనా బిస్రక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామనీ.. మరిన్ని వివరాలు అందాల్సి ఉందని మిశ్రా స్పష్టం చేశారు.