క్రైమ్/లీగల్

ఇసుక అక్రమ తవ్వకాన్ని అరికట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను వెంటనే అరికట్టాలని సుప్రీం కోర్టు రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డె నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశించింది. ప్రబలిన అక్రమ ఇసుక తవ్వకాలపై గట్టిగా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ బాబ్డె దిశానిర్ధేశం చేశారు. అక్రమ రవాణా నిర్మూలించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకున్న చర్యలేమిటో తమకు నాలుగు వారాల్లోగా నివేదిక (ఏటీఆర్) అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డె నేతృత్వంలో న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ఇసుక అక్రమ తవ్వకాలు, రవణాపై విచారణ చేపట్టింది. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా వల్ల పర్యావరణానికి పూడ్చలేనంతగా నష్టం వాటిల్లుతుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. రాజస్థాన్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతున్నదని సుప్రీం కోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
2017 సంవత్సరంలో కూడా సుప్రీం కోర్టు ఇసుక అక్రమ రవాణాపై ఆదేశాలు జారీ చేసింది.