క్రైమ్/లీగల్

ఇదేం నివేదిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణలోని కార్పొరేట్ కాలేజీలు, నిర్వహణ తీరు, విద్యార్థుల ఆత్మహత్యలు, నియమనిబంధనల పాటింపు తదితర అంశాలకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన నివేదికపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక అసంపూర్ణంగా ఉందని వ్యాఖ్యానించింది. వేలాది మంది విద్యార్థులతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారని నిలదీసింది. నిబంధనలను పాటించని
కాలేజీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవహారంపై హైకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది. 45 కాలేజీలు నిబంధనలను ఉల్లంఘించాయని నివేదికలో ఇంటర్ బోర్డు పేర్కొంది. ఈ కాలేజీల్లో 20వేల మంది వరకూ విద్యార్థులున్నారని, నిబంధనలను పాటించని కాలేజీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని న్యాయస్థానం ప్రశ్నించింది. గుర్తింపులేని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటని ఇంటర్ బోర్డు అధికారులను హైకోర్టు నిలదీసింది. ఈనెల 25లోగా సమగ్ర నివేదికను ఇవ్వాలని, అందులో అన్ని వివరాలూ పొందుపరచాలని, కార్పొరేట్ కాలేజీల్లో ఇంత వరకూ మృతి చెందిన విద్యార్థుల వివరాలను సైతం అందులో పొందుపరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 27న చేపట్టనున్నారు.
జీవోలు ఎందుకు పెట్టడం లేదు?
ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోలను వెబ్ పోర్టల్‌లో ఎందుకు పెట్టడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న జీలోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతూ దాఖలైన పిల్‌ను విచారించిన హైకోర్టు ఈ అంశంపై సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.