క్రైమ్/లీగల్

నిర్భయ దోషులకు 3న ఉరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలవుతోంది. నలుగురు నిర్భయ హంతకులు ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ఆక్షయ్ సింగ్‌ను మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ హైకోర్టు సోమవారం తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది. ముద్దాయిలు మరణించే వరకూ ఉరి తీయాలని న్యాయస్థానం ఆదేశించింది. నిర్భయ హంతకులు రాష్టప్రతి క్షమాభిక్ష, తదితర కారణాలతో ఇప్పటికి రెండు సార్లు ఉరి తీత నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే న్యాయపరంగా లభించే అన్ని అవకాశాలను వారం లోగా ఉపయోగించుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టు విధించిన గడువుకూడా ముగిసింది. దీంతో మరణశిక్ష అనివార్యం తప్పనిసరైంది. శిక్ష అమలును తప్పించుకునేందుకు ముద్దాయిలకు ఇక ఎలాంటి అవకాశం లేదు. దీంతో మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు నలుగురు దోషులు ఉరి కంభం ఎక్కకక తప్పదు. ఢిల్లీ హైకోర్టుకు చెందిన పాటియాలా కోర్టు అదనపు సెషన్ జడ్జి ధర్మేందర్ రాణా సోమవారం తాజా డెత్ వారెంట్ జారీ చేశారు. తీహార్ జైలు అధికారులు సీఆర్‌పీసీలోని 413 సెక్షన్ ప్రకారం ముద్దాయిలకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగటం లేదు కాబట్టి తాజాగా డెత్ వారెంట్లు జారీ చేయాలని పెట్టుకున్న దరఖాస్తు మేరకు పాటియాలా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఇంతకు ముందు జనవరి 17 తేదీ నాడు డెత్ వారంట్ జరీ చేస్తూ ఫిబ్రవరి 1 తేదీనాడు నలుగురు నిర్భయ దోషులను ఉరి తీయాలని ఆదేశించటం తెలిసిందే. అయితే ముద్దాయిలు పెట్టుకున్న దరఖాస్తుల మూలంగా అదే ట్రయల్ కోర్టు ఉరి శిక్ష అమలుపై స్టే ఇచ్చింది. వినయ్ శర్మ, అక్షయ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్లు పరిశీలనలో ఉన్నందున డెత్ వారంట్‌ను అమలు చేయటం సాధ్యం కాదనే అభిప్రాయంతో ట్రయల్ కోర్టు స్టే ఇచ్చింది. రాష్టప్రతి తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఫిబ్రవరి 11న కొట్టివేసింది. అలాగే న్యాయపరమైన అన్ని అవకాశాలను వారం రోజుల్లోగా ఉపయోగించుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టు విధించిన గడువు కూడా ముగియడంతో తీహార్ జైలు అధికారులు తాజా డెత్ వారంట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటియాల్ సెషన్ జడ్జి మార్చి 3వ తేదీన ఉరి శిక్ష అమలు చేయాలంటూ డెత్ వారెంట్ జారీ చేశారు. న్యాయమూర్తి ధర్మేందర్ రాణా డెత్ వారెంట్ ఆదేశం చదువుతున్నప్పుడు కోర్టులో ఉన్న ముద్దాయి ముకేష్ తల్లి బోరున విలపించింది. తన కొడుకుకు క్షమాభిక్ష పెట్టాలంటూ చేతులు చోడించి కోరుకుంది. మరో దోషి వినయ్ శర్మ న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ తన క్లయిటు పిబ్రవరి 11వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడని కోర్టుకు తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ‘చట్ట ప్రకారం ముద్దాయి పట్ల వ్యవహరించండి’అని జైలు అధికారులను ఆదేశించారు.
*చిత్రాలు.. నలుగురు నిర్భయ హంతకులు ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ఆక్షయ్ సింగ్‌
*కోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడుతున్న నిర్భయ తల్లి