క్రైమ్/లీగల్

కృష్ణానదిలో పడి ఇద్దరు యువకుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, ఫిబ్రవరి 16: కృష్ణానదిలో స్నానం చేయాలన్న సరదా ఆ ఇద్దరి యువకుల ప్రాణాలు బలికొన్న విషాద సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ నియోజవకవర్గంలోని కృష్ణ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై మురళీ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రామకృష్ణ, శ్రీహరి రాజు కృష్ణ మండలం వాసునగర్ శివారులోని కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని చూసేందుకు ఆదివారం వాసునగర్‌లోని వారి బంధువుల ఇంటికి వచ్చారు. కాగా ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు మొత్తం ఆరుగురు స్నానాలు చేసేందుకు ఉదయం 10.30 గంటలకు స్నానానికి కృనదిలోకి వెళ్లారు. అందులో ఒక అమ్మాయ కాలుజారి పడిపోగా ఆమెను ప్రయత్నించేందుకు మిగతా వారు ప్రయత్నించారు. రామకృష్ణ, శ్రీహరి రాజు నీటమునిగి మృతి చెందారు. మిగతా వారిని స్థానిక జాలారి కాపాడటంతో సుమ, మధు, వర్మ, లిక్కి ప్రాణాలతో బయటపడ్డారు. బంధువులతో కలవడానికి వచ్చిన ఆ యువకులు తమ విలువైన ప్రాణాలను కోల్పోవడంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయ. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మురళీ తెలిపారు.
*చిత్రం...నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని కృష్ణానదిలో పడి మృతి చెందిన
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రామకృష్ణ, శ్రీహరిరాజు