క్రైమ్/లీగల్

ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, ఫిబ్రవరి 16: అనుమానాస్పద స్థితిలో ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కండ్రిక ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహ్మద్ రజియా, తాజుద్దీన్‌ల కు ఇద్దరు ఆడ, ఒక మగ సంతానం ఉ నారు. కొన్నాళ్ల క్రితం తాజుద్దీన్ చనిపోవడంతో కండ్రికలో నివసిస్తూ పాయకాపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో రజియా నర్స్‌గా పనిచేస్తోంది. పెద్ద కుమార్తె అయిన మహ్మద్ నజ్రీన్ (12) స్థానికంగా ఉన్న పాఠశాల్లో 6వ తరగతి చదువుతోంది. ఉన్నట్టుండి ఆదివారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన చున్నీతో ఫ్యాన్ హుక్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు సమాచారం తెలుసుకున్న పోలీసులు తండ్రి లేడనే దిగులుతోనో, ఆకతాయితనంతోనో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.