క్రైమ్/లీగల్

నలుగురు పిల్లల సజీవదహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఫిబ్రవరి 15: పంజాబ్‌లో శనివారం ఓ ఘోర ప్రమాదం జరిగింది. బడి పిల్లలను తీసికెళ్తున్న ఒక మినీ వ్యాన్‌లో మంటలు చెలరేగి, అందులో ప్రయాణిస్తున్న పిల్లల్లో నలుగురు సజీవ దహనమయ్యారు. సంగ్రూర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, లోంగోవాల్- సిద్‌సమాచార్ రోడ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మినీ వ్యాన్‌లో 12 మంది పిల్లలు ఉన్నారు. సమీపంలోని పంట క్షేత్రాల్లో పనిచేస్తున్న వారు హుటాహుటిన వచ్చి వ్యాన్‌లోని ఎనిమిది మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీయగలిగారని పోలీసులు తెలిపారు. అయితే, ఈ లోపే మంటలు తీవ్రమయి, పది నుంచి 12ఏళ్ల మధ్య వయసు కలిగిన నలుగురు పిల్లలు సజీవ దహనమయ్యారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ‘సంగ్రూర్‌లో ఒక పాఠశాల వ్యాన్ మంటల్లో చిక్కుకొని నలుగురు పిల్లలు సజీవ దహనమయిన విషాదకర ఘటన కలచివేసింది. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగింది. సంగ్రూర్ డీసీ, ఎస్‌ఎస్‌పీ ఘటనా స్థలికి వెళ్లారు. దోషులను కఠినంగా శిక్షించడం జరుగుతుంది’ అని ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. మినీ వ్యాన్‌లో మంటలు లేవడానికి కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మినీ వ్యాన్ మంటల్లో చిక్కుకున్న వెంటనే దాని డ్రైవర్ వ్యాన్ తలుపులు తెరవడానికి ప్రయత్నించినప్పటికీ, అవి తెరచుకోలేదని పోలీసులు చెప్పారు.