క్రైమ్/లీగల్

కేసుల వివరాలు ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని క్రిమినల్ కేసుల వివరాలను పార్టీ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సుప్రీంకోర్టు అన్ని రాజకీయ పార్టీలను ఆదేశించింది. రాజకీయాలు పెద్ద ఎత్తున నేరపూరితం అవుతున్నాయంటూ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయాలంటూ సుప్రీం కోర్టు 2018లో ఇచ్చిన తీర్పును రాజకీయ పార్టీలు పాటించడం లేదంటూ దాఖలైన కోర్టు ధిక్కారానికి సంబంధించిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం స్పందిస్తూ ఈ ఆదేశం జారీ చేసింది. క్రిమినల్ కేసులు ఉన్న వారికి ఎందుకు టికెట్లు ఇవ్వవలసి వచ్చిందనేది కూడా ఆయా రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని కోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తి రొహింటోన్ ఫాలి నారిమన్ నాయకత్వంలోని సుప్రీం కోర్టు బెంచి ఈ ఆదేశం ఇస్తూ క్రిమినల్ కేసులు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వటానికి గల కారణాలు సమర్థనీయంగా ఉండాలని పేర్కొంది. గెలుపుగుర్రాలు గాబట్టి నేర చరిత్ర ఉన్నా పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దించటం ఎంత మాత్రం మంచిది కాదని స్పష్టం చేసింది. ఆయా రాజకీయ పార్టీలు విద్య, అర్హతల కారణంగా టికట్లు ఇవ్వాలే తప్ప గెలుపు ముఖ్యం కాకూడదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. క్రిమినల్ కేసులు ఉన్న వారికి టికెట్లు లభించటం గత నాలుగు సాధారణ ఎన్నికల్లో బాగా పెరిగిపోయిందని వ్యాఖ్యానించింది. అభ్యర్థుల క్రిమినల్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలు, జాతీయ, ప్రాంతీయ పత్రికల్లో
ప్రకటించాలి, ప్రచురించాలని కూడా సుప్రీం కోర్టు ఆయా రాజకీయ పార్టీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ కేసులు ఉన్న వారికి టికెట్లు ఇచ్చే పక్షంలో అందుకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన కంప్లయన్స్ నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి టికెట్లు ఇచ్చిన 72 గంటల్లోగా అందజేయాలని అన్ని రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను పాటించని రాజకీయ పార్టీల వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కోర్టు ధిక్కారం కేసులో కేంద్ర ఎన్నికల సంఘం న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ నేర చరిత్ర, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న పార్లమెంటు సభ్యుల సంఖ్య రోజురోజుకు పెరగటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంటులోని మొత్తం ఎంపీల్లో దాదాపు 43 శాతం మందిపై క్రమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, నేర చరిత్ర ఉన్నదని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు వివరించింది. రాజకీయాలను నేరపూరితం చేసే విధానాన్ని మానుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలన్నీ ఈ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించాలని తేల్చిచెప్పింది.
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులందరు తమపై ఉన్న క్రిమినల్ కేసులు, నేర చరిత్రను ఎన్నికలకు ముందే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని 2018 సెప్టెంబర్‌లో
ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించటం తెలిసిందే. ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల నేర చరిత్ర, క్రిమినల్ కేసుల వివరాలు జాతీయ, ప్రాంతీయ వార్తా పత్రికల్లో ప్రచురించాలని కూడా సుప్రీం కోర్టు అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రాజకీయాలు నేర పూరితం కాకుండా చూసేందుకు పార్లమెంటు సముచిత చట్టాలు చేయాలని కూడా సుప్రీం కోర్టు 2018 ఆదేశంలో స్పష్టం చేసింది.