క్రైమ్/లీగల్

చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 27: రాత్రివేళల్లో షట్టర్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడిన కేసుల్లో నలుగురు నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా రాజస్థాన్‌కు చెందిన వారు. నిందితుల నుంచి మూడు కేసుల్లో సుమారు రూ.7లక్షల 30వేలు విలువైన నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన మంగిలాల్, షైల్ సింగ్, రమేష్ రాబరి, కన్నయ్ లాల్ పాత నేరస్తులే. గతంలో వివిధ చోరీ కేసుల్లో అరెస్టుయి జైలుకు వెళ్లి తిరిగి వచ్చాక కూడా నేర ప్రవృత్తిని కొనసాగిస్తున్నారు. రాత్రివేళ వన్‌టౌన్, పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ షాపుల షట్టర్లకు వేసిన తాళాలను విరగగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో వన్‌టౌన్ పోలీస్టేషన్ పరిధిలోని పలు షాపుల్లో చోరీలకు పాల్పడగా ఆయా కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు నలుగురిని గుర్తించి అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు కేసుల్లో సుమారు ఏడు లక్షల 30వేలు విలువ చేసే నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. కేసుల్లో నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన సిసిఎస్ సిఐలు పి వెంకటేశ్వరరావు, సిహెచ్‌పి కృష్ణంరాజు, సిహెచ్ చలపతిరావు, సిసిఎస్ ఎస్‌ఐలు సిహెచ్ నాగ శ్రీనివాస్, వైఎస్ రమేష్, సిబ్బంది స్వామి, ప్రసాద్, రమణ, గోపి, ప్రవీణ్, ఆరీఫ్‌లను పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు అభినందించారు.