క్రైమ్/లీగల్

అన్నీ మాముందు ఉంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి సోమవారం నాడు హైకోర్టులో విచారణ కొనసాగింది. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించిన పరిస్థితిపై హైకోర్టు ఆరా తీసింది. డిజైన్లు ఖరారు చేశారా? సచివాలయ నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించారా? అని ప్రశ్నించింది. అన్ని వివరాలనూ హైకోర్టు ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. ప్రస్తుత సచివాలయ నిర్మాణం స్థానంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనపై హైకోర్టులో
దాఖలైన పిటిషన్లపై కొద్ది నెలలుగా విచారణ కొనసాగుతోంది. సచివాలయాన్ని కూల్చివేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో దీని విషయంలో ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదని అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. కూల్చివేత ఆపాలనే తాము ఆదేశాలిచ్చామని, నిర్మాణానికి సంబంధించి, నమూనా రూపకల్పన, అంచనా వ్యయం విషయంలో ఎలాంటి స్టే ఇవ్వలేదని హైకోర్టు పేర్కొంది. నూతన సచివాలయం నిర్మాణం కోసం 400 కోట్ల రూపాయిలు ఖర్చు కావచ్చని ప్రాథమిక అంచనాగా ఉందని అదనపు అడ్వకేట్ జనరల్ రామచందరరావు తెలిపారు. ఆ వివరాలన్నింటినీ కోర్టు ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.