క్రైమ్/లీగల్

ఏడుగురి ఊచకోత ఘటనలో రివ్యూ పిటిషన్‌పై తీర్పు రిజర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రియుడితో కలిసి ఓ మహిళ తన ఏడుగురు కుటుంబ సభ్యులను హతమార్చిన ఉదంతంలో సుప్రీంకోర్టు విధించిన మరణశిక్ష అంశంలో రివ్యూ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వులో ఉంచింది. ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు, వారి భార్యలు, పదేళ్ల చిన్నారిని హతమార్చిన వైనంలో సుప్రీం కోర్టు ఇద్దరికీ మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దోషులు ఇద్దరికీ మరణశిక్ష విధించగా.. వీరు రివ్యూ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే, న్యాయమూర్తులు ఎస్‌ఏ నజీర్, సంజీవ్ ఖన్నా ధర్మాసనం రివ్యూ పిటిషన్‌పై విచారణ నిర్వహించింది. హత్యోదంతం అనంతరం దోషుల వైఖరిలో మార్పు వచ్చే అవకాశాలున్నాయా? ప్రతి నేరస్థుడిలోనూ ఓ సున్నిత మనస్తత్వం ఉంటుందా? తదితర కోణాలపై సీనియర్ న్యాయవాదులు ఆనంద్ గ్రోవర్, మీనాక్షి అరోరాలను అడిగింది. వాదోపవాదాల అనంతరం రివ్యూ పిటిషన్‌ను స్వీకరించే అంశంపై తీర్పును సుప్రీం కోర్టు ధర్మాసనం రిజర్వులో ఉంచింది.