క్రైమ్/లీగల్

తూ.గో.లో ఉన్మాది పైశాచికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, జనవరి 22: తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామంలో బుధవారం వేకువజామున ఒక ఉన్మాద చర్య చోటు చేసుకుంది. రాక్షసుడిగా మారిన ఒక వ్యక్తి తన మేనమామ కుటుంబంపై పెట్రోలు చల్లి నిప్పంటించాడు. ఇంట్లో వారంతా ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో ఈ ఉన్మాద చర్యకు దిగడంతో వారంతా మంటల్లో చిక్కుకున్నారు. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందారు.
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా వుంది. దుళ్ల గ్రామానికి చెందిన కొట్ని అప్పారావు కుటుంబం మార్కెట్ సెంటర్‌లోని ముత్తరాసుల వీధిలో నివాసం ఉంటోంది. అప్పారావు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరి రెండో కుమార్తెకు అప్పారావు మేనల్లుడు మసాల శ్రీనివాసుతో వివాహం చేయాలని నాలుగేళ్ల క్రితం భావించారు. చిత్తూరు జిల్లా తిరుపతి ప్రాంతంలో తాపీ పనిచేసుకునే శ్రీనివాసు ప్రవర్తన సరిగా లేకపోవడంతో వివాహానికి అప్పారావు కుటుంబం నిరాకరించింది. అనంతరం శ్రీనివాసుకు వేరే అమ్మాయితో వివాహం జరిగింది. అప్పారావు కుమార్తెకు సైతం మూడేళ్ల క్రితం వేరే వ్యక్తితో వివాహం జరిగింది. కాగా ఈ నెల 15వ తేదీన దుళ్ల గ్రామానికి వచ్చిన శ్రీనివాసు మేనమామ అప్పారావు భార్య సత్యవతితో నాలుగేళ్ల నాటి వివాహ విషయమై వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నైట్‌వాచ్‌మేన్‌గా పనిచేసే అప్పారావు మంగళవారం రాత్రి విధి నిర్వహణకు వెళ్లాడు. అప్పారావు భార్య సత్యవతి, కుమారుడు రాము, పెద్ద కుమార్తె గంటా దుర్గ్భావాని, ఆమె పిల్లలు విజయలక్ష్మి, కుమారులు ఏసుకుమార్, దుర్గామహేష్‌కుమార్ ఇంట్లో నిద్రించారు.
బుధవారం వేకువజామున వారి ఇంటి నుండి మంటలు చెలరేగి, హాహాకారాలు మిన్నంటడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఇంటి తలుపులు బయట గడియ పెట్టి వుండటంతో తలుపులు తెరిచి, మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటల తీవ్రతకు తీవ్రంగా గాయపడిన అప్పారావు కుమారుడు రాము (18), మనుమరాలు గంటా విజయలక్ష్మి (5) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మిగిలిన వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అప్పారావు భార్య సత్యవతి (55) మృతి చెందింది. అప్పారావు పెద్ద కుమార్తె దుర్గ్భావాని 80శాతం కాలిన గాయాలతో విషమ పరిస్థితుల్లో ఉంది. మనుమలు ఏసుకుమార్, దుర్గామహేష్‌కుమార్ చికిత్స పొందుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అప్పారావు మేనల్లుడు శ్రీనివాసు గ్రామ శివారులోని పెట్రోలు బంకులో మంగళవారం అర్థరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో సీసాలో పెట్రోలు తీసుకెళ్లినట్టు సీసీ పుటేజీలో గుర్తించారు. దీని ఆధారంగా అతడే ఇంటి తలుపులకు బయట గడియపెట్టి, పెట్రోలు పోసి నిప్పంటించినట్టు పోలీసులు నిర్థారించారు.
తల్లిని పరామర్శించడానికి వచ్చి...
కాగా ఉన్మాది శ్రీనివాసరావు కత్తితో దాడి చేయడంతో గాయపడిన తల్లి సత్యవతిని పరామర్శించడానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి వచ్చిన పెద్ద కుమార్తె దుర్గ్భావాని తన పిల్లలతో సహా ఈ దురాగతానికి బలైపోయింది. ఆమె కుమార్తె విజయలక్ష్మి సజీవ దహనం కాగా, దుర్గ్భావాని 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో పోరాడుతోంది. ఆమె ఇద్దరు కుమారులు సైతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు.