క్రైమ్/లీగల్

గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోర్బా, జనవరి 22: చత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో 23 ఏళ్ల ఓ గిరిజన యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. బాల్కోనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన ఆ మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని, వారిని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. భర్త నుంచి విడిపోయిన ఆమె గత కొన్ని రోజులుగా పుట్టింట్లోనే ఉంటోందని వారు అన్నారు. దుండగులు ఆమెను తాళ్లతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారని వారు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె సోమవారం తన తల్లిదండ్రులకు తెలిపిందని పోలీసులు పేర్కొన్నారు. తమకు సమాచారం అందిన తర్వాత రాజేష్ కుమార్ (28), శ్రీ సింగ్ కన్వర్ (26), అశ్వినీ కుమార్ (25)ను అరెస్టు చేశామని, వారిపై ఐపీసీ 376 (డీ) కింద కేసు నమోదు చేసినట్టు వారు తెలిపారు.
సీఏఏకు నిరసనగా