క్రైమ్/లీగల్

రూ. 3 లక్షల లంచంతో దొరికిపోయిన అధికారిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మూడు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసిన ఓ అవినీతి అధికారిణి సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలకు చిక్కింది. రూ.3 లక్షల లంచం తీసుకుంటూ కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో భూ సంస్కరణల అధీకృత అధికారిణిగా పనిచేస్తున్న దాసరి ప్రశాంతి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామానికి చెందిన మేకా రామలింగేశ్వరరెడ్డి ఉయ్యూరు మండలం కాటూరులో 4.53 ఎకరాలు భూమిని గతంలో కొనుగోలు చేశారు. సదరు భూమికి పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం ఉయ్యూరు మండల రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ భూమి సీలింగ్‌లో ఉండటం వల్ల కలెక్టరేట్‌లో ఉన్న భూ సంస్కరణల అధీకృత అధికారి పరిధిలోకి సమస్య వెళ్లింది. పాస్ పుస్తకాల కోసం గడిచిన మూడేళ్లుగా తిరుగుతున్నా సీలింగ్ పేరు చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధిత రైతు వాపోయాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం సీలింగ్ ఎత్తి వేసి పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు బాధిత రైతుని రూ.6లక్షల లంచం ఇవ్వాలని ప్రశాంతి లంచం డిమాండ్ చేసింది. దీనికి సమ్మతించిన బాధిత రైతు ఆ తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల పథకంలో భాగంగా తొలిగా రూ.3 లక్షల నగదును ఓ కవర్‌లో పెట్టి సోమవారం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో ఉన్న ప్రశాంతికి అందజేశారు. అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీలు కె ఉమామహేశ్వరరాజు, సురేష్ నేతృత్వంలో సీఐలు ఎన్‌ఎస్‌ఎస్ అపర్ణ, శ్రీనివాసరావు, కృపావందనం దాడి చేసిన వారిలో ఉన్నారు. కాగా ఏసీబీకి చిక్కిన ప్రశాంతి రూ.3లక్షలతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. విచారణ నిమిత్తం సదరు రైతుని రమ్మంటే సీల్డు కవరులో రూ.3లక్షలు పెట్టి తనకు ఇచ్చారని, ఈ నగదుతో తనకెటువంటి సంబంధం లేదని స్షష్టం చేసింది. ఇదిలా ఉంటే ప్రశాంతి గతంలోనూ ఏసీబీ దాడిలో పట్టుబడటం గమనార్హం. ఏ. కొండూరు తహశీల్దార్‌గా ఉన్న సమయంలో పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు విషయమై 2016 మే నెలలో ఓ రైతు నుండి రూ.8వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఆ సమయంలో ఆమె వద్ద రూ.8వేలు కాకుండా లెక్కకు సంబంధం లేని రూ.4లక్షల 70వేలు నగదు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాలు గడవక ముందే మళ్లీ ఏసీబీ అధికారులకు పట్టుబడటం గమనార్హం.
'చిత్రం... కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో భూ సంస్కరణల అధీకృత అధికారిణి దాసరి ప్రశాంతి