క్రైమ్/లీగల్

ముగ్గురు చిన్నారులను మింగిన మొరం గుంత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: అక్రమార్జన కోసం ఇష్టారీతిన తవ్విన మొరం గుంతలు అభంశుభం తెలియని చిన్నారుల నిండు ప్రాణాలను కబళించాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గత ఏడు మాసాల క్రితమే మొరం గుంతలో పడి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందిన సంఘటన ఇంకా మరువక ముందే, ఇదే తరహాలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలాపేపర్‌మిల్ గ్రామానికి చెందిన సిద్ధార్థ్ (8), దీపక్ (7), హుజూఫుద్దీన్ (7) ఆడుకునేందుకు వెళ్లి మొరం గుంత నీటిలో పడి ఊపిరాడక జల సమాధి అయిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. మృతుల్లో సిద్ధార్థ్, దీపక్ అన్నదమ్ములు. ఈ విషాదకర ఉదంతంతో గ్రామం యావత్తూ శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వాగ్మారే గౌతమ్, పూజా దంపతులకు ముగ్గురు మగ పిల్లలు సంతానం. పెద్ద కుమారుడు సిద్ధార్ థ(8) మూడవ తరగతి, రెండవ కుమారుడు దీపక్ (7) రెండవ తరగతి చదువుతుండగా, అదే గ్రామానికి చెందిన జలాల్ అనే వ్యక్తి కుమారుడు హుజూఫుద్దీన్ (7) కూడా రెండవ తరగతి ఒకే బడిలో కలిసి చదువుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో వీరు ముగ్గురూ కలిసి ఆడుకునేందుకు గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఓ రైతుకు చెందిన పట్టా భూమిలో గతంలో మొరం కోసం తవ్వకాలు జరపడంతో లోతైన గుంత ఏర్పడింది. అందులో వర్షపునీరు నిల్వ ఉంది. ఈ విషయం తెలియని చిన్నారులు ఆడుకునేందుకు ఆ మొరం గుంతలో దిగి, నీట మునిగి అందులోనే మునిగిపోయారు. ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులు ఆదివారం రాత్రి వరకు కూడా ఇళ్లకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు ఎంత గాలించినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మొరం గుంత వద్ద చిన్నారులు ఆడుకున్న సైకిల్ టైరు కనిపించడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించగా, బోధన్ రూరల్ సీఐ షాకీర్, రెంజల్ ఎస్‌ఐ శంకర్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అప్పటికే బాగా చీకటి పడడంతో సోమవారం ఉదయం గజఈతగాళ్లను పిలిపించి మొరం గుంతలో గాలింపు జరిపించారు. దీంతో నీట మునిగి విగతజీవులుగా మారిన సిద్ధార్థ్, దీపక్, హుజూఫుద్దీన్ మృతదేహాలు బయటపడ్డాయి. ఈ విషయం దావానంలా వ్యాపించడంతో నీలాపేపర్‌మిల్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి తరలివచ్చి చిన్నారుల మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. పిల్లల శవాల వద్ద తల్లిదండ్రులు, కుటుంబీకులు ఆర్తనాదాలు చేస్తూ గుండెలవిసేలా రోదించగా, వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులు..అంతలోనే అనంతలోకానికి పయనం కావడం యావత్ గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది.
'చిత్రం...మొరం గుంతలో నీట మునిగి ఊపిరాడక మృతి చెందిన చిన్నారులు