క్రైమ్/లీగల్

సమత కేసులో వాదనలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జనవరి 20: కుమ్రంభీం జిల్లా లింగాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్లాపటార్ అటవీ ప్రాంతంలో దళిత మహిళపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును ఈనెల 27కు వాయిదా వేసింది. నవంబర్ 24న సమతను కిరాతకంగా హత్యాచారం చేసిన ఘటన సంచలనం సృష్టించగా ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి డిసెంబర్ 14న ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో చార్జిషీట్ ప్రవేశపెట్టారు. గత నెల 23 నుండి ప్రత్యేక న్యాయస్థానంలో సమత కేసు విచారణ కొనసాగుతుండగా, బాధితురాలి తరపున నివేదించిన 44 మంది సాక్షులకు న్యాయస్థానం 25 మందిని విచారించింది. ఈ కేసులో డిఫెన్స్ న్యాయవాది రహీం కోర్టులో వాదనలు వినిపిస్తూ చార్జిషీట్‌లో పేర్కొన్న విధంగా అత్యాచారం జరిగినట్టు శాస్ర్తియ ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేయాలని కోరారు.
నిందితుల తరఫున సాక్షులను ప్రవేశపెట్టేందుకు న్యాయస్థానం రెండు రోజుల గడవు ఇచ్చినప్పటికీ ఎవరూముందుకు రాకపోవడంతో ప్రాసిక్యూషన్ వాదనలు వినిపిస్తూ నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని కోరారు. సోమవారం ఇరు పక్షాల వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం సమత కేసు తుది తీర్పును ఈనెల 27న వెల్లడించనున్నట్టు ప్రకటించింది.