క్రైమ్/లీగల్

‘స్థానిక’ రిజర్వేషన్లపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 19: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్దంగా 59.85శాతం రిజర్వేషన్లు కేటాయించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 20వ తేదీ సోమవారం రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానంలో విచారణ ప్రారంభం కానుంది. కర్నూలు నగరానికి చెందిన బిర్రు ప్రతాపరెడ్డి ఈ అంశంపై మొదట హైకోర్టులో పిటిషన్ వేయగా దాన్ని తిరస్కరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినట్లుగా ఈ నెల 17వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియకు ఆమోదం తెలుపుతూ స్థానిక ఎన్నికలకు పచ్చ జెండా ఊపింది. దాంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లి స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. అక్కడ విచారణ అనంతరం అధికంగా రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ అయిన జీఓలను నిలుపుదల చేస్తూ పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నెల రోజుల్లో తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. దాంతో ఈ పిటిషన్‌పై సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానుందని పిటిషనర్ బిర్రు ప్రతాపరెడ్డి ఆదివారం ఆంధ్రభూమికి తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు కాదని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 59.85శాతం స్థానాలను రిజర్వేషన్ విధానంలో కేటాయించారని వెల్లడించారు. దీంతో రిజర్వేషన్ వర్తించని వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో
అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధిక స్థానాలను రిజర్వేషన్‌లో కేటాయిస్తే తమకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోకుండా జీఓ జారీ చేసిందని మండిపడ్డారు. దాంతో తాము హైకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. అక్కడ న్యాయం జరగలేదని సుప్రీం కోర్టుకు వెళ్లగా నెల రోజుల్లో విచారించి తుది తీర్పు ఇవ్వాలని ఆదేశించిందన్నారు. రిజర్వేషన్లు గతంలో తామిచ్చిన తీర్పునకు లోబడి ఉండాలని సుప్రీం కోర్టు హైకోర్టుకు సూచించినట్లు ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. హైకోర్టులో ఫిబ్రవరి 15వ తేదీ లోపు విచారణ పూర్తయి తుది తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సారి తమకు న్యాయం జరుగుతుందన్న ధీమాతో ఆయన ఉన్నారు.