క్రైమ్/లీగల్

ప్రొఫెసర్ కాశింను హైకోర్టులో హాజరు పర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: ఉస్మానియా యూనివర్శిటీలో తెలుగు విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ చింతకింది కాశింను ఆదివారం ఉదయం తమ నివాసంలో హాజరుపరచాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు. గజ్వేల్ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు పేర్కొనగా, అవసరం లేదని తన నివాసంలో హాజరుపరచాలని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇటీవలె విరసం కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కాశిం ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన నివాసానికి శనివారం ఉదయం గజ్వేల్ పోలీసులు వెళ్లి కాశింను అరెస్టు చేశారు. కాశీం అరెస్టు అక్రమమని, బేషరతుగా విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నేతలు, ప్రజాసంఘాల నేతలు పోలీసులను అడ్డుకోగా, వారిని సైతం అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మొత్తం వ్యవహారంపై పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రధాన న్యాయమూర్తి నివాసంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రొఫెసర్ కాశింను అక్రమంగా అరెస్టు చేశారని, వెంటనే కోర్టులో హాజరుపరచాలని హెబియస్ కార్పస్ పిటిషన్‌ను వేశారు. పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి విచారణకు స్వీకరించి సాయంత్రం ఐదు గంటలకు విచారణ చేపట్టారు. ఐదు సంవత్సరాల క్రితం జరిగిన కేసులో ఇపుడు అక్రమంగా అరెస్టు చేశారని కాశిం తరఫున న్యాయవాది రఘునాధ్ వాదనలు వినిపించారు. 2016 నాటి కేసులో నేటికీ కాశీం తప్పించుకున్నారని పోలీసులు పేర్కొనడాన్ని ప్రధాన న్యాయమూర్తి తప్పుపట్టారు. ప్రతి రోజు యూనివర్శిటీలో పనిచేసుకుంటున్న అధ్యాపకుడు పరారయ్యారని ఎలా చెబుతారని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో పోలీసులు తమ వాదనలు వినిపిస్తూ గజ్వేల్ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పగా, అవసరం లేదని, ఆదివారం ఉదయం తమ నివాసంలో హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది.