క్రైమ్/లీగల్

నటి షబానాకు తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 18: పూణే-ముంబయి ఎక్స్‌ప్రెస్ వేలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటి షబానా ఆజ్మీ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఆమెను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఓ కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు షబానా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆ సమయంలో కారులో ఆమె, డ్రైవర్ మాత్రమే ఉన్నారని తెలుస్తోంది. ముంబయికి 60 కి.మీ దూరంలో కాలాపూర్‌కు సమీపంలో తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద తీవ్రత కారణంగా కారు బాగా దెబ్బతిన్నదని వెల్లడించారు. ఈ ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు