క్రైమ్/లీగల్

ఢిల్లీ సైబర్ క్రైం ముసుగులో టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 18: ఢిల్లీ సైబర్ క్రైం ముసుగులో మోసానికి పాల్పడి డబ్బు దండుకున్న ముఠాకు సైబర్ క్రైం పోలీసులు చెక్ పెట్టారు. పోగొట్టుకున్న సొమ్ము రికవరీ చేసి తిరిగి బాధితునికి అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాచవరం పోలీస్టేషన్ పరిధిలోని జయప్రకాష్‌నగర్ ఎల్‌ఐసీ కాలనీకి చెందిన వీ వెంకటేశ్వరరావుకు 2019 నవంబర్ 8న ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులమంటూ ఫోన్‌కాల్ వచ్చింది. నీ ఫోన్ నుంచి మహిళలకు కాల్స్ వస్తున్నాయని బెదిరించి వెంటనే ఢిల్లీ రావాల్సిందిగా హుకుం జారీ చేశారు. బెదిరిపోయిన వెంకటేశ్వరరావు అంతదూరం రాలేనని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అదేరోజు వొడా ఫోన్ లీగల్ టీమ్ నుంచి సంజయ్ శర్మ అనే వ్యక్తి మాట్లాడుతున్నానని తన సిమ్ క్లోన్ అయి ఉండవచ్చని తాను చెప్పినట్లు వింటే తాను వాడుతున్న యాపిల్ ఫోన్ సిమ్ తీసి ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి మారిస్తే సిమ్ క్లోన్ అయిందీ లేనిదీ తెలుస్తుందని నమ్మబలికి తనకు ఫోన్ చేయాల్సిందిగా సూచించాడు. దీంతో వెంకటేశ్వరరావు ఆండ్రాయిడ్ ఫోన్‌లో సిమ్ వేసి వారికి ఫోన్ చేయగా అవతలి వ్యక్తి చెప్పిన ప్రకారం ప్లే స్టోర్ ద్వారా డీఓటీ సెక్యూర్, ఏపీకే అనే యాప్‌ను డౌన్‌లోడు చేసుకున్నాడు. దీంతో వెంకటేశ్వరరావు క్రెడిట్ కార్డుకు సంబందించిన సమాచారం హైజాక్ అయింది. హెచ్‌డీఎఫ్‌పీ క్రెడిట్ కార్డు నుంచి రూ.7,71,388 లక్షలు విలువైన ఫ్లైట్ టికెట్‌లను వివిధ ప్రాంతాలకు కొనుగోలు చేసినట్లు వచ్చింది.