క్రైమ్/లీగల్

కూతురుపై అఘాయత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెదురుకుప్పం, జనవరి 16: కామాంధుడైన ఓ తండ్రి తన పనె్నండేళ్ల కన్నకూతురిని బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దామరకుప్పం సమీపంలోని బ్రహ్మంగారి ఇండ్లల్లో బుధవారం పట్టపగలు చోటుచేసుకుంది. ఈ విషయం ఎవరికైనా చెబితే జైలుకు వెళ్లివచ్చైనా చంపేస్తానని కుటుంబ సభ్యులను బెదిరించాడు. ఎట్టకేలకు స్థానికుల సహకారంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుత్తూరు డీఎస్పీ మురళీధర్ కేసు నమోదు చేసి కామాంధుడిని అరెస్ట్ చేశారు. డీఎస్పీ మురళీధర్ కథనం మేరకు బ్రహ్మంగారిఇండ్లలో నివాసం ఉంటున్న కృష్ణయ్య బోయుడు (48), చెంచమ్మ అనే మహిళను రెండు దశాబ్దాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికిద్దరు కుమారులు ఉన్నారు. భర్తను వదలిపెట్టిన చెంచమ్మ సోదరి అంకమ్మను సైతం రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరి కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చెంచమ్మ, అంకమ్మలు తిరుపతిలోని ఒక హోటల్‌లో పనిచేసేవారు. తాగుడుకు బానిసైన కృష్ణయ్య గతంలో రెండుసార్లు కుమార్తెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఇది అంకమ్మకు తెలిసినా కుటుంబ పరువుకోసం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. తాను పని కోసం తిరుపతికి వెళితే తన బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడతాడేమోనని భావించి బాలికను పుత్తూరులోని బీసీ వసతిగృహంలో చేర్పించింది. సంక్రాంతి సెలవులు కావడంతో కుమార్తె ఇంటికి వచ్చింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న దుర్మార్గుడు ఇద్దరు తల్లులను పనికి వెళ్లాక కూతురిని ఈ రాక్షసుడు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి ఇంటికి వచ్చిన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పి బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. దీంతో తల్లులిద్దరూ భర్తను నిలదీశారు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే జైలు నుంచి వచ్చిన తరువాత అందర్నీ చంపేస్తామని బెదిరించినట్లు బాధితురాలి తల్లులు పోలీసులకు వివరించారు. విషయం గుప్పుమనడంతో ఇరుగుపొరుగువారు వారికి ధైర్యం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారు. బాధితురాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీఎస్పీ మురళీధరన్ కేసు నమోదుచేసి పరీక్షల నిమిత్తం బాధితురాలిని తిరుపతి రుయా వైద్యశాలకు తరలించారు. కామాంధుడైన కృష్ణయ్య భోయుడును అదుపులోకి తీసుకున్నారు. ఆ కామాంధుడికి ఉరిశిక్ష వేయాలని మహిళా సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.