క్రైమ్/లీగల్

ప్రాణం తీసిన రుణ సర్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జనవరి 16: భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బోడుప్పల్ సాయినగర్ రోడ్డు నెంబర్ 5లో నివసిస్తున్న కడప జిల్లా చంపాడు గ్రామానికి చెందిన మంగదొడ్డి అశోక్ కుమార్ (23) క్యాబ్ డ్రైవర్. సంవత్సరం క్రితం తార్నాకలోని ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్న మోత్కూరు వెల్తేరు గ్రామానికి చెందిన చైతన్య (22) పరిచమైంది. ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి నెల రోజుల పసిబిడ్డ ఉంది. సంక్రాంతి పండుగ రోజున ఆనందంగా గడపాల్సిన వీరి ఇద్దరి మధ్య ఏమి జరిగిందో ఏమో కానీ ఇద్దరు ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నుంచి చిన్నారి ఏడుపు విన్న ఇరుగుపొరుగు తలుపులు కొడితే చప్పుడు రాకపోవడంతో కిటికీలో నుంచి చూడగా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న దృశ్యం కన్పించింది. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు.
ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ రఘురామ్ సిబ్బందితో సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పండుగ వేళ, ఇద్దరు మృతి చెందడంతో ఇరువురి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల మృతితో పసి బిడ్డ ఒంటరిదైంది. భార్యాభర్తల ఆత్మహత్యకు ఆర్ధిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.