క్రైమ్/లీగల్

దుండిగల్‌లో దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జనవరి 16: మద్యం సేవించేందుకు తీసుకువెళ్లి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చర్చి గాగిల్లాపూర్ గ్రామంలో నివాసముండే యాదాగౌడ్(35) ప్రైవేట్ ఉద్యోగి. అదే కాలనీలో కిరాయికి ఉంటున్న ఆసీఫ్‌కి యాదాగౌడ్‌కు పరిచయం ఉంది. బుధవారం రాత్రి యాదాగౌడ్ ఇంటికి ఆసీఫ్ వెళ్లి మద్యం సేవించేందుకు స్థానికంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమీపంలోకి తీసుకువెళ్లాడు. మద్యం సేవించే క్రమంలో యాదాగౌడ్‌ను కత్తితో ఆసిఫ్ అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు. మృతుని ఇంటికి వెళ్లి హత్య చేశానని చెప్పాడు. మృతుని భార్య వెళ్లి పరిశీలించి పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్ష్యలే హత్యకు కారణమై ఉంటాయని భావిస్తున్నారు.