క్రైమ్/లీగల్

ఐటీ ఉద్యోగిని రోహిత అద్యశ్యం కేసు: వీడిన మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 16: రెండు వారాలుగా కనిపించకుండా పోయన ఐటీ ఉద్యోగిని రోహిత అదృశ్యం కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులు, భర్త నుంచి దూరంగా వెళ్లి ఉద్యోగం సంపాదించుకుని స్వతంత్రంగా జీవించాలని పారిపోయినట్లు పూణె పోలీసులకు రోహిణి వాంగ్మూలం ఇచ్చింది.
బుధవారం రాత్రి పూణె నుంచి తీసుకొచ్చిన రోహితను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మళ్లీ పారిపోవడానికి ప్రయత్నించి అర్ధరాత్రి చలిలో పోలీసులకు చెమటలు పట్టించింది. గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్ రావు కథనం ప్రకారం గచ్చిబౌలిలోని యాపిల్ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న రోహిత గత నెల 26న అదృశ్యమైయింది. డిసెంబర్ 26న నివాసముంటున్న మంత్రి అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వెళ్లిపోయింది. రెండు రోజులుగా రోహిత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సోదరుడు పరీక్షిత్ డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదైనప్పటి నుంచి గచ్చిబౌలి పోలీసులు ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి రోహిత కోసం గాలింపు ప్రారంభించారు. గచ్చిబౌలి పోలీసులు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి గాలిస్తున్నప్పటికీ రోహిత మిస్సింగ్ కేసు పట్టించుకోవడం లేదని ఉన్నతాధికారులకు ట్విటర్ ద్వారా పరీక్షిత్ పలుమార్లు ఫిర్యాదు చేశాడు. సైబరాబాద్, రాచకొండతో పాటు హైదరాబాద్ కమిషనరేట్‌లో రోహిత నగరంలో కనబడినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి పరుగులు పెట్టించాడు. పూణేలో ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థలో రోహిత ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు మాటువేసి పటుకున్నారు. పూణె పోలీసులకు రోహితను అప్పగించి నగరానికి తీసుకొచ్చేందుకు ప్రత్నించగా వచ్చేందుకు ఆమె నిరాకరించింది. తను స్వాతంత్రంగా బతకాలని ఉందని తల్లిదండ్రులు, భర్త ఎవరూ వద్దని ప్రశాంతంగా ఉండనివ్వాలని పోలీసులను కోరింది. పూణే, గచ్చిబౌలి పోలీసులు, సోదరుడు పరీక్షిత్ ఫోన్‌లో మాట్లాడించగా స్వాతంత్రంగా జీవించాలని కోరుకుంటున్నట్లు వివరించింది. పోలీసులు నచ్చచెప్పి నగరానికి బుధవారం రాత్రి తీసుకొచ్చారు. గచ్చిబౌలికి వచ్చిన తరువాత పోలీసులను రాత్రంతా పరుగులు పెట్టించింది. గచ్చిబౌలి నుంచి ఆరాంఘర్ చౌరస్తాకు వెళ్లిపోయింది. బతిమాలాడి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు రాత్రి రెండున్నర గంటలకు అప్పగించారు. ఎల్‌బీనగర్ పోలీసుస్టేషన్‌లో ఆరు నెలల క్రితం భర్తపై వేదింపుల కేసును రోహిత పెట్టినట్టు పోలీసులు తెలిపారు. రోహిత వాంగ్మూలం తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు.