జాతీయ వార్తలు

మాటలే తప్పించి.. చర్యలు శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దళితులకు మేలు చేయని ప్రత్యేక సమావేశం * సిపిఎం ధ్వజం
న్యూఢిల్లీ, నవంబర్ 28: మాటలే తప్పించి చేతలలో రిక్తహస్తం చూపించటంలో మోదీ ప్రభుత్వం తన ప్రత్యేకతను మరోసారి రుజువుచేసుకుందని సిపిఎం విమర్శించింది. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని పార్లమెంట్ శీతాకాలం సమావేశాలలో మొదటి రెండు రోజులు ప్రత్యేక సమావేశంగా నిర్వహించి తమ బాధ్యత తీరిపోయిందని చేతులు దులుపుకున్నారు తప్పించి దళితులకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి తీసుకున్న చర్యలు శూన్యమని సిపిఎం తెలిపింది. దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింప చేయటానికి అంబేద్కర్ కృషి చేశారు. ఆరన్నర దశాబ్దాలుగా దళితుల పరిస్థితి మరింత దిగజారిందే తప్పించి మెరుగుపడలేదని, ఈ సమస్యను లోతుగా చర్చించి దళితుల రక్షణకు పదునైన చట్టం చేసి ఉంటే అంబేద్కర్‌కు ఘనమైన నివాళి అర్పించినట్లు ఉండేదని సిపిఎం అభిప్రాయపడింది. ఈ దిశలో ఎలాంటి కసరత్తు చేయకుండాప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలక్షేపం చేసిందని విమర్శించింది. లోక్‌సభ అమోదం పొంది, రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న అత్యాచార నిరోధక బిల్లును ఈ సమావేశాలలో ఆమోదింప చేస్తామన్న కనీస హామీని కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకోవటం క్షమార్హం కాదని సిపిఎం పేర్కొంది. ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు అమలైతే తప్ప దళితులకు పూర్తి న్యాయం జరగదని, ఈ మేరకు చట్టాన్ని రూపొందించటానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందో అర్థం కావటం లేదని తెలిపింది. దళితులపై జరుగుతున్న వివక్షపై ఒక సమగ్ర నివేదికను పార్లమెంట్‌కు సమర్చించాలన్న విజ్ఞత కూడా ప్రభుత్వానికి లేదని సిపిఎం తప్పుపట్టింది.