రాష్ట్రీయం

ఉభయ సభల్లో 'అరుణాచల్' రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. అరుణాచల్ వ్యవహారంపై చర్చకు లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ చర్చకు అనుమతించకపోవడంతో సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. కాంగ్రెస్ తో పాటు జేడీ(యూ), ఎన్సీపీ కూడా సభ నుంచి బయటకు వెళ్లిపోయింది. రాజ్యసభలోనూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. పదే పదే సభా కార్యకలాపాలకు అడ్డు తగిలారు. దీంతో సభ మూడుసార్లు వాయిదా పడింది.