రాష్ట్రీయం

21న అసెంబ్లీలో ప్రైవేటు వర్శిటీల బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* త్వరలోనే కామన్ వర్శిటీ బిల్లు * హెచ్‌ఆర్‌డి మంత్రి గంటా వెల్లడి
విశాఖపట్నం, డిసెంబర్ 19: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఈ నెల 21న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.
యూనివర్శిటీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు, యూనివర్శిటీల అభివృద్ధిపై ఎపి చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విశ్రాంత వైస్ ఛాన్సలర్లతో విశాఖలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే ప్రైవేటు యూనివర్శిటీల బిల్లుకు సంబంధించి నిపుణులు, విద్యావేత్తల అభిప్రాయాలను తెలుసుకున్నామని, మంచి చెడులను బేరీజు వేసిన అనంతరం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సుమారు 20 యూనివర్శిటీలకు అనుమతిచ్చే అవకాశం ఉందన్నారు. అనుమతుల ప్రక్రియను నిర్వహించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యూనివర్శిటీలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్న అనుమానం అవసరం లేదన్నారు.
ప్రస్తుతం ఉన్న విశ్వవిద్యాలయాల్లో వౌలిక వసతుల కల్పన, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు సంబంధించి రూ.350 కోట్లను వెచ్చించనున్నట్టు మంత్రి గంటా వెల్లడించారు. యూనివర్శిటీల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఇతర అంశాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడంతో పాటు కామన్ యూనివర్శిటీ బిల్లును తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆయన తెలిపారు. యూనివర్శిటీల్లో పరిస్థితులపై చర్చించేందుకు పూర్వపు వైస్ చాన్సలర్లు సమావేశమై పలు అంశాలను గుర్తిచడం ముదావహమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మరోసారి సమావేశం ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.