రాష్ట్రీయం

పులుల సంరక్షణ కేంద్రాల చుట్టుపక్కల గ్రామాల తరలింపుపై అధ్యయనానికి కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: కవాల్, అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాలకు పరిసరాల్లో ఉన్న గ్రామాలను తరలింపునకు అవసరమైన అధ్యయనం చేసేందుకు రాష్ట్ర స్థాయి పర్యవేక్షక, జిల్లా స్థాయి కమిటీలను నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కవాల్, అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాలకు పరిసరాల్లో పులుల వల్ల ప్రమాదం ఉంటుందని భావించిన ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రజానీకాన్ని తరలించేందుకు అనువుగా ఈ కమిటీలు తగిన నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి 2008 ఫిబ్రవరి నుంచి పులుల సంరక్షణ కేంద్రాలకు దగ్గరగా ఉన్న గ్రామాలను గుర్తించాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పుడు రాష్ట్ర, జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలను నియమించినట్లు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర స్థాయి కమిటీకి చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సభ్యులుగా అటవీ లేదా గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, సిసిఎల్‌ఏ తరఫున ప్రతినిధి, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్లను, ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్రప్రభుత్వ ఎన్‌టిసిఏ ప్రతినిధి, కవాల్ లేదా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరక్టర్లలో ఒకరిని, హోంశాఖ లేదా పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల నుంచి ఎవరో ఒకరిని నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే జిల్లా స్థాయి కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, సభ్యులుగా జిల్లాపరిషత్ సిఇఓ లేదా జెసి, సంబంధిత ఆర్‌డిఓ లేదా ఎమ్మార్వో, ఐటిడివోపివో, సభ్యులుగా ఆర్‌అండ్‌బి లేదా పంచాయతీరాజ్ లేదా వ్యవసాయ శాఖలను ఒకరు, సభ్య కార్యదర్శిగా డిప్యూటీ డైరెక్టర్ టైగర్ రిజర్వ్, ప్రత్యేక ఆహ్వానితులుగా సంబంధిత పులుల సంరక్షణ కేంద్రం ఫీల్డ్ డైరెక్టర్లును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.