రాష్ట్రీయం

టి.వృత్తివిద్యా కోర్సుల్లో ఫీజుల నిర్ధారణకు కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: తెలంగాణలోని వృత్తివిద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఫీజుల నిర్ధారణకు జస్టిస్ పి.స్వరూపరెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో ఆయనతో సహా 11 మంది సభ్యులు ఉంటారు. జస్టిస్ పి స్వరూపరెడ్డి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. ఈ కమిటీ తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు, వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజులను కూడా నిర్ధారిస్తుంది. కమిటీలో జెఎన్‌టియుహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.యాదయ్య, గాంధీ ఆస్పత్రికి చెందిన ప్రొఫెసర్ పివి.చలం, చార్టర్డ్ అకౌంటెంట్ జివి.లక్ష్మణ్‌రావు, న్యాయవాది కె.రవీందర్‌రెడ్డి, జెఎన్‌టియుహెచ్ విసి, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ విసి, ఉస్మానియా యూనివర్శిటీ విసి, ఆర్ధిక శాఖ కార్యదర్శి, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్, ఎఐసిటిఇ ప్రతినిధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు జస్టిస్ స్వరూప్‌రెడ్డి సిఫార్సు మేరకు మరో సభ్యుడిని కూడా నియమిస్తారు.
ప్రైవేటు యాజమాన్యాల మాటేమిటి?
రాష్ట్రంలో ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలోనే దాదాపు వెయ్యికి పైగా కాలేజీలు నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వం నియమించిన కమిటీలో ప్రైవేటు యాజమాన్యాల ప్రస్తావన లేకపోవడం విడ్డూరం. గతంలో ఫీజుల నిర్ధారణ కమిటీల్లోనూ ప్రైవేటు యాజమాన్యాలకు ప్రాతినిధ్యం ఉండేది, కాని ఈసారి లేకపోవడంపై యాజమాన్యాల ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.