రాష్ట్రీయం

ఆరు సింగపూర్ ఉపగ్రహాలతో 16న నింగిలోకి పిఎస్‌ఎల్‌వి సి-29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, డిసెంబర్ 10: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో విదేశీ అంతరిక్ష వాణిజ్య ప్రయోగానికి సన్నద్ధమైంది. ఈ నెల 16న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేష్ సెంటర్ (షార్) నుంచి సాయంత్రం ఆరుగంటలకు పిఎస్‌ఎల్‌వి సి-29 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి ఏర్పాట్లన్నీ శాస్తవ్రేత్తలు పూర్తి చేశారు. షార్‌లో తొలి ప్రయోగ వేదిక నుంచి జరిగే రాకెట్ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన 400 కిలోల బరువుఉన్న టెలీస్-1, 135 కేజీల బరువుగల వెలాక్స్ పి-1, 12కిలోల బరువుఉన్న వెల్సాక్స్-2, 80 కిలోల బరువుఉన్న కెంట్ రిట్జ్, రెండు కిలోల బరువున్న ఎలాసియా ఆరు ఉపగ్రహాలను ఒకసారి నింగిలోకి పంపనున్నారు. మొత్తం 629 కిలోల బరువుఉన్న ఉపగ్రహాలు భూమి నుంచి ఎగిరిన అనంతరం ఇరవై నిమిషాల వ్యవధిలో కక్ష్యలోకి చేర్చనున్నారు. ఇప్పటికే తొలి ప్రయోగ వేదికపై రాకెట్ నాలుగు దశల అనుసంధానం పూర్తి చేసి చివరిదశలో ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియ కూడా శాస్తవ్రేత్తలు పూర్తి చేశారు. ఈ నెల 13న ప్రయోగానికి సంబంధించిన చివరి మెషిన్ రెడీనెస్ రివ్యూ సమావేశం డాక్టర్ సురేష్ అధ్యక్షతన జరగనుంది. సమావేశంలో షార్ డైరెక్టర్‌తో సహా శాస్తవ్రేత్తలు అంతా పాల్గొని చర్చించిన అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు. ఇస్రో వర్గాల సమాచారం ప్రకారం సాయంత్రం ఆరుగంటలకు ప్రయోగించనున్నట్లు తెలిపారు.