రాష్ట్రీయం

కరవును జయిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం
భూగర్భజలాలు పెంచే బాధ్యత అందరిదీ
రాయలసీమను రతనాల సీమ చేస్తా
జలాల పెంపునకు ‘పంట సంజీవని’
అసెంబ్లీలో సిఎం చంద్రబాబు వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 21: మనల్నిచూసి కరవు భయపడి పారిపోయేలా పనిచేద్దాం. అవసరమైతే పంట పొలాల్లో పడుకుని రైతులను చైతన్యపరుద్దాం. కరవును జయిద్దాం అని సిఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే వరకూ తాను నిద్రపోనని, రాయలసీమను రత్నాల సీమగా మారుస్తామని వెల్లడించారు. నీరు- ప్రగతి అంశంపై శాసనసభలో సోమవారం జరిగిన సుదీర్ఘ చర్చకు సిఎం బదులిచ్చారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపునకు ‘పంట సంజీవని’ పేరిట కొత్త కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి, భూగర్భ జలాల పెంపునకు, ప్రాజెక్టుల పనితీరు, నిధుల విడుదల, లక్ష్యాలను సిఎం సుదీర్ఘంగా వివరించారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని కరవురహితంగా తయారుచేయడం ప్రభుత్వ దార్శనికతగా ఉందన్నారు. చక్కటి నీటి సంరక్షణ ద్వారా పేదరికాన్ని నిర్మూలించి, ఆర్ధిక అసమతుల్యత తగ్గించడమే లక్ష్యమన్నారు. పేదరిక నిర్మూలన ప్రధాన లక్ష్యంగా వృద్ధిచోదకాలను బలోపేతం చేయడం కోసం ఏడు మిషన్లలో ఒకటైన ప్రాథమిక రంగం మిషన్ కింద నీటి సంరక్షణ మిషన్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో భిన్నమైన హైడ్రో మెటోరోలాజికల్ పరిస్థితులు ఉన్నాయని, రాష్ట్రంలో వర్షపాతం 940 ఎంఎం కాగా అనంతపురంలో 540 ఎంఎం, కోస్తాజిల్లాల్లో 1200 ఎంఎంకు మించిన వర్షపాతం ఉందన్నారు. వర్షపాతం అస్థిరంగా ఉండి, ఏకరీతిన విస్తరించి ఉండటం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 40 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నాయని, వాటిలో 40 నదులు, 12 చిన్న నదుల జలాలు కలుస్తున్నాయని, గోదావరి నుండి సగటున 3వేల టిఎంసిల జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఏడు ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుందని, హంద్రీ నీవా సుజల స్రవంతి ఫేజ్-1, 2, పట్టిసీమ ఎత్తిపోతల సాగునీటి పథకం, గాలేరు నగరి సృజల స్రవంతి ఫేజ్-1, తోటపల్లి, గుండ్లకమ్మ రిజర్వాయిర్, పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, బిఆర్‌ఆర్ వంశధార స్టేజ్-2, ఫేజ్-2 ఉన్నాయని చెప్పారు. ప్రాథమిక రంగం మిషన్ కింద నీటి సంరక్షణ, నీరు- చెట్టు సబ్ మిషన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దీనికోసం స్పష్టమైన లక్ష్యాలు, ఉద్దేశాలు, సంస్థాగత ఏర్పాట్లు చేశామని పనుల పురోగతి ఆశాజనకంగా ఉందని చెప్పారు. చెరువుల పూడికతీత, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పనులకు దాదాపు 1108 కోట్లు మంజూరు చేశామన్నారు. నీటి సంరక్షణ కట్టడాలకు 1097 కోట్లు, తేమ సంరక్షణకు 307 కోట్లు, చెట్టు కార్యక్రమం కింద 214 కోట్లు, చెక్‌డ్యామ్‌లకు 15 కోట్లు, సాగునీటి కుంటలకు 37.65 కోట్లు, నీటి సంరక్షణకు 523.33 కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు. నీరు -చెట్టు కింద 2174 కోట్లు ఖర్చు చేశామని సిఎం చెప్పారు. దీనివల్ల 2.55 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించామని వెల్లడించారు. నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాలని, అందరిలో చర్చ జరగాలని, పదేపదే తనే మాట్లాడటం వల్ల ఫలితం ఉండదన్నారు. నీరు ప్రగతి ద్వారా వివిధ స్థాయిల్లో నీటి ఆడిట్‌లను నిర్వహించాలని, తుదిగా మండలస్థాయి వరకూ ప్రణాళికలు రూపొందించేందుకు దోహదపడుతుందన్నారు. నదుల అంతర్ అనుసంధానం, చెరువుల పూడికతీత, నీటి సంరక్షణ కట్టడాలు, జలపాతంలోని చెరువుల అభివృద్ధి, చెక్‌డ్యాంల శ్రేణులు, పంట సంజీవని (సాగు కుంటలు), రెయిన్ గన్స్ వంటి ఫలితాలు సాధించామని అన్నారు. 7905 సాగు కుంటలను తవ్వడం వల్ల అదనంగా 1725 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని పేర్కొన్నారు. నీరు చెట్టు పనులను చేపట్టడం వల్ల భూగర్భ జల స్థాయిల్లో గణనీయమైన పెరుగదల గమనించామని వెల్లడించారు.