అంతర్జాతీయం

వాతావరణ పరిరక్షణకు ప్రపంచం పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాన్స్‌లో ఆరో రోజుకు చేరిన చర్చలు
‘నిర్మాణాత్మక దిశ’లో భారత్, అమెరికా కృషి
ఉభయులకూ అనువైన ఒప్పందానికి యత్నాలు

లీ బౌర్గెట్ (ఫ్రాన్స్), డిసెంబర్ 5: వాతావరణ సమస్యల నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న శిఖరాగ్ర చర్చల్లో విస్తృత ప్రయత్నాలు చేస్తున్న భారత్, అమెరికా ఇరు దేశాలకు అనువుగా ఉండే ఒప్పందం కోసం ‘నిర్మాణత్మక దిశ’లో కృషి చేస్తున్నాయని అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫ్రాన్స్‌లోని లీ బౌర్గెట్‌లో జరుగుతున్న ఈ చర్చలు శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. దీంతో ఈ చర్చల్లో పాల్గొన్న 195 దేశాల ప్రతినిధులు ప్రపంచంలో ఇంతకుముందు ఎన్నడూ లేనంత సంక్లిష్టమైన వాతావరణ ఒప్పందానికి పునాది వేసేందుకు కాలంతో పోటీపడుతూ విస్తృత కసరత్తు సాగిస్తున్నారు. పర్యావరణ సమస్యలపై 2009లో కోపెన్‌హాగన్‌లో జరిగిన శిఖరాగ్ర చర్చలు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. అయితే ఈసారి అటువంటి వైఫల్యాన్ని పునరావృతం కాకుండా చూడగలమని, వాతావరణ సమస్యల పరిష్కారానికి వచ్చే వారాంతంలోగా ఏదో ఒక ఒప్పందం కుదురుతుందని ప్రస్తుత శిఖరాగ్ర చర్చల్లో పాల్గొంటున్న దాదాపు అన్ని దేశాల ప్రతినిధులు గట్టి విశ్వాసంతో ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులను సమకూర్చడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీచేయడం వంటి పలు అంశాలపై కొన్ని దేశాల మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తడంతో ప్రస్తుత చర్చల్లో ఇప్పటివరకూ స్వల్ప పురోగతి మాత్రమే సాధ్యమైంది. అయితే వాతావరణ సమస్యల పరిష్కారానికి భారత్, అమెరికా కలసికట్టుగా పనిచేస్తున్నాయని, ఈ విషయంలో ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఇరు దేశాలు ఇప్పుడు కూడా సరైన దిశలోనే ముందుకు సాగుతున్నాయని అమెరికా ప్రత్యేక రాయబారి టాడ్ స్టెర్న్ స్పష్టం చేశారు.
గత వారం రోజుల వ్యవధిలో తాను భారత ప్రతినిధులతో నాలుగైదు సమావేశాలు జరిపానని, వాతావరణ ఒప్పందంకోసం ఇరుదేశాలు విస్తృత కృషి సాగిస్తూ నిర్మాణాత్మక దిశలో ముందుకు సాగుతున్నాయని ఆయన అన్నారు.