రాష్ట్రీయం

ఖైదీలకు క్షమాభిక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వం అనుమతిస్తే జనవరి 26న విడుదల
300 మందికి విముక్తి కలిగే అవకాశం

హైదరాబాద్, డిసెంబర్ 17: జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు త్వరలో స్వేచ్ఛ లభించనుంది. క్షణికావేశంలో నేరాలకు పాల్పడి ఏళ్లకేళ్లుగా వేలాది మంది ఖైదీలు జైలు జీవితం గడుపుతున్నారు. వీరిలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు, జీవిత ఖైదీలను వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజున విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఖైదీల క్షమాభిక్షకు సంబంధించి ఏర్పాటయిన జైలు సూపరింటెండెంట్‌ల కమిటీ ఓ జాబితాను ఇటీవలే తయారు చేసింది. జైలు నిబంధనలకు లోబడి సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలతో పాటు వృద్ధులకూ విముక్తి కల్పించాలని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు జైలు అధికారులు అర్హత కలిగిన ఖైదీల జాబితాతో కూడిన ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఇందులో దాదాపు 250 మంది జీవిత ఖైదీలు, 50 మంది వృద్ధ ఖైదీలు ఉన్నట్టు సమాచారం. ఈ నివేదికపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం ప్రభుత్వం ఖైదీల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నివేదికలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకపోతే జనవరి 26న చాలా మంది ఖైదీలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలావుండగా 2011లో కొన్ని తీవ్ర నేరాలకు పాల్పడిన వారు మినహా సత్ప్రవర్తన కలిగిన కొద్ది మందిని మాత్రమే క్షమాభిక్షపై విడుదల చేశారు.