AADIVAVRAM - Others

విమర్శలు లెక్క చేయను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్, కోలీవుడ్డే కాదు.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తమన్నా తన ఫవరేంటో చూపించడానికి సిద్ధమవుతోంది. ఇలా మూడు భాషల్లో లభించిన అవకాశాల ద్వారా అందర్నీ మెప్పించేలా తన క్యారెక్టర్స్‌ను ఓ సవాల్‌గా తీసుకొని అడుగులు వేస్తోంది. కెరీర్‌పై తమన్నాకున్న శ్రద్ధ అంతా ఇంతా కాదు. ఆ శ్రద్ధే ఆమెను ఉన్నత స్థాయిలో నిల్చుండేలా చేస్తోంది అంటున్నారు ఆమె సన్నిహితులు. ప్రస్తుతం ప్రభుదేవాతో ‘అభినేత్రి’తో పాటు ఎస్.ఎస్.రాజవౌళి ‘బాహుబలి-2’లోనూ నటిస్తూ యమబిజీగా వుంది. అయితే తమన్నా చేసిన కొన్ని చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు కొంత విమర్శకు తావిచ్చాయి. ఈ విషయం గురించి ఆమెను ప్రశ్నిస్తే- ‘‘విమర్శలు నేను అస్సలు పట్టించుకోను. అలా విమర్శలు వచ్చినప్పుడు మనం ఎదగడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. వాటి లెక్కచేస్తే మన కెరీర్ సందిగ్ధంలో పడుతుంది. అందుకే అడుగులు ముందుకు వేయడమే తప్ప..వెనకకు చూసే ప్రసక్తే ఉండకూడదు’’అంటోంది ఈ మిల్క్‌బ్యూటీ. నిజమే..మరి అలా ఆలోచించబట్టే నేడు ఈ స్థాయిలో మనకు దర్శనమిస్తోంది మరి!

-సమీర్