జాతీయ వార్తలు

చీఫ్ జస్టిస్‌పై లైంగిక ఆరోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్‌పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టులో నాలుగవ తరగతి ఉద్యోగినిగా పనిచేసిన మాజీ ఉద్యోగిని ఈ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆమె కోర్టుకు రాసిన లెటర్‌లో తాను ఏవిధంగా చీఫ్ జస్టిస్ చేతిలోలైంగికంగా వేధింపులకు గురైంది వెల్లడించింది. 2018 అక్టోబర్ 10 లేదా 11న చీఫ్ జస్టిస్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. 2014 నుంచి తాను సుప్రీంకోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశానని తెలిపింది. సీజేఐకి సహకరించటం లేదని తనను విధుల నుంచి తొలగించారని పేర్కొంది. ఆ తరువాత పోలీసు శాఖలో పనిచేసే తన భర్తను, కోర్టులో గ్రూపుడి హోదాలో పనిచేసే తన సోదరుడిని కూడా విధుల నుంచి తప్పించారని ఆమె పేర్కొంది. తనకు జరిగిన వేధింపులపై మాజీ జడ్జీలతో విచారణ జరిపించాలని కోరింది. ఈ కేసు నేపథ్యంలో సుప్రీం కోర్టు బెంచ్ ఒకటి ఈ కేసును విచారణ చేపట్టింది. కాగా ఈ ఆరోపణలను చీఫ్ జస్టిస్ గొగొయ్ తోసిపుచ్చారు. తాను ప్రతి ఉద్యోగిని గౌరవంగా చూశానని, ఆమె తన వద్ద నెలన్నర మాత్రమే పనిచేసిందని ఆయన తెలిపారు. వచ్చేవారం కీలకమైన కేసులు ఉన్నాయని వాటి నుంచి దృష్టి మరలించేందుకు ఈ ఆరోపణలను ముందుకు తీసుకువచ్చారని ఆయన తెలిపారు.