మనోజ్ కెరీర్‌లో భిన్నమైన సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు మనోజ్, రెజీనా జంటగా సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘శౌర్య’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని, మార్చి 4న విడుదలకు సిద్దంగా వుంది. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ చెప్పిన విశేషాలు..
కథే ముఖ్యం
ఇదొక లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ అంశాలతోపాటు ఓ క్రైమ్‌థీమ్ సినిమా అంతా ట్రావెల్ అవుతూ ఉంటుంది. కథే సినిమాకు పెద్ద హైలైట్. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అవుతుంది. వేదా మ్యూజిక్ మరో హైలైట్ అవుతుంది. స్క్రీన్‌ప్లే కథకు ప్రాణంగా నిలుస్తుంది. దర్శకుడు దశరథ్ ఏ రకం సినిమా అయినా డైరెక్ట్ చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి.
కొత్త వాళ్ళకు ప్రోత్సాహం
ఇదివరకు మా బ్యానర్‌లో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్‌ను పరిచయం చేశాం. ఈ సినిమా ద్వారా మరో మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం కాబోతున్నాడు. సంగీత దర్శకుడిగా వేదాకు ఇది మొదటి సినిమా అయినా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
మనోజ్ కెరీర్‌లోనే..
మొదటిసారిగా ఈ సినిమాలో మనోజ్ సాఫ్ట్‌లుక్‌లో కనిపించబోతున్నాడు. కొత్తదనం కోరుకునే ఆడియన్స్‌కు మనోజ్ బాగా రీచ్ అవుతాడు. ఇక ప్రస్తుతం చాలామంది నిర్మాతలు క్యాషియర్స్‌గా మారిపోతున్నారు. చేసే పనిమీద అవగాహన లేకపోతే అవుట్‌పుట్ సరిగ్గా రాదు. ప్రొడక్షన్ హౌస్‌కి నిర్మాతే బాస్. తప్పు జరిగినా, ఒప్పు జరిగినా ఆయనదే బాధ్యత.
భారీ విడుదల..
ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 700 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. ఓవర్సీస్‌లో 300 థియేటర్లలో ప్లాన్ చేస్తున్నాం. సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం.
తరువాతి ప్రాజెక్టులు..
ఉగాది రోజున ఓ సినిమా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాను. కథలు చెప్పడానికి చాలామంది దర్శకులు వస్తున్నా, వారు గతంలో ఎక్కడ పనిచేశారు అనే విషయాలను అసలు పట్టించుకోను. కథ నచ్చితే చాలు. పనిచేయాలనే తపన దర్శకుడిలో ఉండాలి. - శ్రీ