AADIVAVRAM - Others

చూసే కోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనిలేని ముచ్చట్లు చాలామందికి ఇష్టంగా ఉంటాయి. చాలామంది ఈ మాటలతో కాలం వెళ్లబుచ్చుతూ ఉంటారు. ఓ నలుగురు వ్యక్తులు ఒక్కచోట కూర్చున్నప్పుడు అక్కడ లేని ఐదో వ్యక్తి గురించి వ్యర్థ ప్రసంగాలు చేస్తుంటాడు. ఆ నలుగురిలో ఒక్కరు వెళ్లిపోయిన తరువాత ఆ వెళ్లిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు.
ఈ వ్యర్థ ప్రసంగాల వల్ల ఫలితం ఉండదు. అనవసర అభిప్రాయాలు ఏర్పరచుకోవడం మినహా ఎలాంటి ఫలితం ఉండదు. ఒక్కో విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. ఒక్కో వ్యక్తి గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిర్ణయానికి వస్తారు. వారు చూసిన కోణాలు సరైనవి కావొచ్చు. కాకపోవచ్చు.
ఉద్యోగులకి బదిలీలు సహజం. న్యాయమూర్తులకి ప్రతి మూడు సంవత్సరాలకి బదిలీలు ఉంటాయి. బదిలీలు అయి కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు చాలామంది అక్కడి ఉద్యోగుల గురించి పాత అధికారి రాసిన రహస్య నివేదికలను ముందుగా చదువుతూ ఉంటారు. ఆ పనిని నేను ఎప్పుడూ చేయలేదు. ఓ మూడు నాలుగు మాసాల తరువాత అవసరమైతే ఆ రహస్య నివేదికలను పరిశీలించేవాడిని. పాత అధికారి అభిప్రాయాలతోపాటూ ప్రయాణం చేయడం మంచిది కాదని నా అభిప్రాయం. కొన్నిసార్లు కొంత మంది ఉద్యోగుల గురించి అతని అభిప్రాయాలు మనకి సరైనవిగా అన్పించక పోవచ్చు.
నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు మా ప్రొఫెసర్ చెప్పిన ఈ చిన్న కథ నాకు ఎప్పుడూ గుర్తుకొస్తుంటుంది. ఆయన గురించి రకరకాల విషయాలు ప్రచారంలో వుండేవి. వాటికి సమాధానంగా ఆ కథ చెప్పాడు.
ఓ రోజు కుర్చీని ముందుకు జరిపి - ‘ఈ కుర్చీలో మీకు ఎన్ని కాళ్లు కన్పిస్తున్నాయి’ అడిగాడు.
‘నాలుగూ’ అన్నారు అందరూ.
‘కుర్చీకి ఎన్ని కాళ్లు ఉన్నాయని నేనడగలేదు. మీకు ఎన్ని కన్పిస్తున్నాయని అడిగాను. ఇప్పుడు చెప్పండి’ అని ఎడమవైపు కూర్చున్న విద్యార్థులని అడిగాడు.
‘మూడు’ సమాధానం చెప్పారు వాళ్లు.
కాస్త దూరంగా వున్న వాళ్లను అదే ప్రశ్న అడిగాడు. కొంతమంది మూడు కన్పిస్తున్నాయని అంటే మరి కొంతమంది నాలుగని సమాధానం చెప్పారు. ఇప్పుడు చెప్పండి... ఏది నిజం?