రకుల్ 2020

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన్మథుడు 2 తరువాత అప్‌డేట్స్‌లో లేకుండా పోయిన రకుల్‌ప్రీత్ సింగ్ -ఇక వరుస సినిమాలతో బిజీ కానుందట. తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమల మీద ఒకేస్థాయి ఫోకస్ పెడుతున్న రకుల్, ఫైనలైన ప్రాజెక్టుల్ని బట్టి వచ్చే ఏడాది తీరికలేని షెడ్యూల్స్ గడపనుందని తెలుస్తోంది. మన్మథుడు 2 తరువాత -హిందీలో ఆమె చేసిన ‘మార్జావన్’ సినిమా నవంబర్ 8న థియేటర్లకు రానుంది. రితేష్ దేశ్‌ముఖ్, సిద్ధార్థ మల్హోత్రాలతో దర్శకుడు మిలాప్ మిలాన్ ఝవేరీ తెరకెక్కించిన ‘మార్జావన్’పై రకుల్ చాలానే ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే సైన్ చేసిన కొత్త ప్రాజెక్టులు కొత్త ఏడాదిలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉండటంతో -ఏడాదంతా బిజీయేనంటోంది రకుల్. వాటిలో శివకార్తికేయన్‌తో దర్శకుడు ఆర్ రవికుమార్ తెరకెక్కించనున్న ఎస్‌కె 14, ఏస్ డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 కూడా ఉన్నాయంటోంది రకుల్. తెలుగులోనూ నితిన్ -చంద్రశేఖర్ యేలేటి కాంబోలో తెరకెక్కనున్న ప్రాజెక్టుకు ఇప్పటికే రకుల్ ఎంపికైంది. సో, హిందీ, తమిళం, తెలుగు సినిమాలతో వచ్చే ఏడాది ఫుల్ బిజీగా గడిపేస్తానంటోంది రకుల్.