ఈ కథ.. ఆ కథేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనూహ్యంగా వచ్చిన క్రేజ్‌ని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు కూడా. దర్శకుడు పరశురామ్‌ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ‘గీతగోవిందం’ లాంటి సెనే్సషనల్ హిట్టు ఇచ్చిన తరువాత -పరిశ్రమ పరశురామ్ వెనుక పడుతుందనే అనుకున్నారంతా. గీతగోవిందం ఇమేజ్‌ను ఒక్క పరిశురామ్ తప్ప అంతా క్యాష్ చేసుకున్నారు. సెనే్సషన్ హిట్టించిన దర్శకుడికి మాత్రం సినిమా లేకుండాపోయింది. గట్టి ప్రయత్నాల తరువాత హీరో మహేష్‌కు పరశురామ్ ఓ పాయింట్ చెప్పినట్టు కథనాలు బయటికొచ్చినా.. -తరువాత అప్‌డేట్స్ కాదుకదా అడ్రెస్సే లేకుండాపోయింది. కాలమెప్పుడూ ఒకే తీరున ఉండదన్నట్టు -పరశురామ్‌కి ఇప్పుడు టైమొచ్చిందా? అనిపిస్తోంది. ఎందుకుంటే -పరశురామ్ కథ వినడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడట. మిర్చి, సాహో చిత్రాలు చేసిన యువీ క్రియేషన్స్ నిర్మాతలు -పరశురామ్‌తో ప్రభాస్‌తో కథ చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. ప్రభాస్ ఒకే అన్న వెంటనే మొత్తం కథ నెరేట్ చేసేందుకు పరశురామ్ సన్నాహాల్లో ఉన్నాడని తెలుస్తోంది. ఇదంతా బాగానే ఉంది, కాకపోతే ప్రభాస్‌కు చెప్పబోయే కథ -ఇంతకుముందు మహేష్‌కు చెప్పిందేనా? అన్న చర్చ మొదలైంది. బ్యాంకు రుణాలు, ఎగవేతదారుల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన కథనే ప్రభాస్‌కూ చెబుతాడా? లేక కొత్త కథను రెడీ చేసుకున్నాడా? అన్న సీక్రెట్ పరిశురామ్ నుంచే బయటకు రావాలి. ఏదేమైనా ప్రభాస్‌కు పరశురామ్ కథ చెప్పడం ఖాయమనే అంటున్నారు. నేడు ప్రభాస్ పుట్టినరోజు. ఆ సందర్భంగా తరుపరి ప్రాజెక్టుకు సంబంధించి అనౌన్స్‌మెంట్ ఏమైనా రావొచ్చన్న అంచనాలు లేకపోలేదు. వినిపించేదంతా నిజమైతే -పరశురామ్‌కి టైమొచ్చేసినట్టే.