ఊరమాస్ పాటకి రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం అల.. వైకుంఠపురములో. హ్యాట్రిక్ ప్రాజెక్టుగా ఆసక్తి రేకెత్తిస్తోన్న సంక్రాంతి సినిమానుంచి ఈమధ్యే విడుదలైన ‘సామజవరగమన’ పాట రికార్డు సృష్టించిందని చిత్రబృందం ఆనందం వ్యక్తంచేస్తోంది. తమన్ సంగీత సారథ్యం వహించిన పాటను సిద్ శ్రీరాం ఆలపించాడు. యూట్యూబ్‌లో ఇప్పటికి 40 మిలియన్ వ్యూస్ సాధిస్తే.. 7 లక్షల లైక్స్‌ని సాంగ్ సొంతం చేసుకుందట. తెలుగు పాటల్లో అత్యధిక లైక్స్ సంపాదించి సాంగ్‌గా రికార్డు క్రియేట్ చేసిందంటూ చిత్రబృందం ప్రకటించుకుంది. పాట సక్సెస్‌ను ప్రస్తావిస్తూ బన్నీ ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్‌కి థాంక్స్ కూడా చేప్పేశాడు. ఫస్ట్ సాంగ్ సెనే్సషన్ ఉత్సాహంలో ఉన్న నిర్మాతలు -మరో పాటను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. సినిమాలో బన్నీ స్టామినాను తెలియజెప్పే ఊర మాస్ సాంగ్ త్వరలోనే బయటకు వదలనున్నారన్న టాక్ వినిపిస్తోంది. మాస్, యూత్‌కి మంచి కిక్కునిచ్చే ఊరమాస్ సాంగ్‌ని థమన్ డిజైన్ చేశాడని తెలుస్తోంది. సహజంగానే బన్నీ సినిమాలో పాటలు బావుంటాయి. అయితే భారీ పోటీ మధ్య విడుదల కానున్న సినిమా కావడంతో -పాటలపరంగా త్రివిక్రమ్ ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నాడని అంటున్నారు. ఈ సినిమాతో బన్నీ -పూజాహెగ్దె రెండోసారి కెమిస్ట్రీ చూపించనున్నారు. సీనియర్ హీరోయిన్ టబు ప్రత్యేక పాత్రలో కనిపించనంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి హిట్లు తరువాత బన్నీ -త్రివిక్రమ్ చేస్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్టు కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి.
మరో హీరో..
అల.. వైకుంఠపురములో మరో హీరో కూడా కనిపించనున్నాడంటూ చిత్రబృందం తాజాగా పస్ట్‌లుక్ వదిలింది. ఆ హీరోయే సుశాంత్. బన్నీ సినిమాలో సుశాంత్ ‘రాజ్’ పాత్ర పోషిస్తున్నట్టు ప్రకటిస్తూ ఫస్ట్‌లుక్ వదిలారు. ‘ఇతని అందమైన చిరునవ్వుకి ఎవ్వరైనా పడిపోతారు’ అంటూ ఓ క్యాప్షన్ సైతం తగిలించారు.
సిద్‌కి చాన్స్‌లు..
ఇదిలావుంటే, సిద్ శ్రీరాంకి తెలుగులో గొప్ప పాటలున్నా, స్టార్ హీరోల నుంచి పెద్దగా అవకాశాలు అందలేదు. అల.. వైకుంఠపురములో సినిమా కోసం పాడిన ‘సామజవరగమన’కు భారీ రెస్పాన్స్ రావడంతో సిద్ స్టామినా మరోసారి ప్రూవైంది. స్టార్ హీరోల ప్రాజెక్టుల్లో సిద్‌కు ఈ సారి సరైన చాన్స్‌లే రావొచ్చన్న టాక్ లేకపోలేదు. అల.. వైకుంఠపురములో సినిమా జనవరి 12న సంక్రాంతి సినిమాగా థియేటర్లకు వస్తోంది. అదే రోజున మహేష్ భారీ ప్రాజెక్టు సరిలేరు నీకెవ్వరు సైతం థియేటర్లకు రానుండటం తెలిసిందే.